రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? లేదా..? అనే అనుమానం కలుగుతోందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య విమర్శంచారు. 5 నెలలుగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా, ఇష్టారీతిన మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ ఎందుకు పట్టించుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. హిందూమతంపై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికుందని స్పష్టం చేశారు. పాలకులు ప్రజాపాలనకు బదులు ఫ్యాక్షన్ పాలన చేస్తున్నారని వేమూరి ఆరోపించారు. మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నాని హిందూమతంతో రాజకీయాలు చేయడం మానేసి... ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
ఇదీ చదవండి