కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, జిల్లా కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు. గ్రామంలో నూతన ప్రదేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు బజార్లను ప్రారంభించారు. ప్రజలకు ప్రభుత్వ పరంగా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ రూపొందించారని ఉదయభాను తెలిపారు. రైతులు పండించిన పంటలను గిట్టుబాటు ధరలకు విక్రయించుకునేలా రైతుబజార్లు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రజలకు, రైతులకు మేలైన కార్యక్రమాలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పాలన సాగిస్తోందని ఉదయభాను అన్నారు.
ఇదీ చదవండి: కేజీహెచ్‌లో క్లినికల్ ట్రయల్స్‌కు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూపులు