ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి మృతి చెందిన 12 మంది మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీఎల్పీ విప్ డోలా బాలవీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు. మద్యం పాలసీపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జె టాక్స్ కోసం వైకాపా నాయకులు ప్రజల రక్తాన్ని జలగల్లా తాగుతున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబాల రోదనలు ప్రభుత్వానికి పట్టడం లేదా అని నిలదీశారు. జగన్ బ్రాండ్లతో ఇంకెంతమంది ప్రాణాలను బలితీసుకుంటారని ధ్వజమెత్తారు.
ఇదీచదవండి.