ముఖ్యమంత్రి జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వకపోవటం వెనుక అంతర్యమేంటని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని కాదనడానికి కారణమేంటని నిలదీశారు. కృష్ణా జిల్లా మైలవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయాలపై మొదటి దాడి జరిగినప్పుడే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు చర్చిలపై దాడులు జరిగేవి కావని అన్నారు దేవినేని. ఇకముందు ఇలాంటి ఘాతుకాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జరిగిన సంఘటనలపై ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.