ఎగువ నుంచి వస్తున్న నీటితో పులిచింతల ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తోంది. ఈ మేరకు అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. పులిచింతలకు 3.1 లక్షల క్యూసెక్కుల నీటి ఇన్‌ఫ్లో ఉండగా..., అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.... ప్రస్తుతం 42.57 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. వరదను దిగువకు పంపిస్తున్న పరిస్థితుల్లో.. ముక్త్యాల, వేదాద్రి, రావిరాల వద్ద నీటి మట్టం గణనీయంగా పెరిగింది. అప్రమత్తంగా ఉండాలని ఆయా ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు. నదీ తీరంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: