ETV Bharat / state

తాగేందుకు పాచి నీరే గతి.. గుడివాడలో ప్రజల దుస్థితి - bad water

కృష్ణా జిల్లాలోని ప్రధాన మండలాల్లోని ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 36 వార్డులు, లక్షకు పైగా జనాభా కలిగిన గుడివాడ నియోజకవర్గంలో పరిస్థితి దారుణంగా మారింది. కుళాయి నీరు పచ్చగా మారి, అపరిశుభ్రంగా ఉంటున్నప్పటికీ వాటినే మహాప్రసాదంలా ప్రజలు తీసుకెళ్తున్నారు.

గుడివాడ
author img

By

Published : Jun 3, 2019, 8:20 PM IST

గుడివాడలో కనిపించని మంచినీటి జాడ

కృష్ణా జిల్లా గుడివాడలో మంచినీటి సరఫరా విషయంలో అధికారుల ఉదాసీనత.. స్థానిక ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. గుడివాడ మున్సిపాలిటీలోని ధన్యాలపేట, బాబూజీనగర్,ఇంద్ర నగర్,వాంబే కాలనీల ప్రజలకు ప్రతి ఏటా వేసవి సమయంలో వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని అందిస్తూ ఉంటారు. ఈ ఏడాది అధికారుల్లో అలసత్వం నెలకొంది. కుళాయి నీరు రోజులో అరగంట కూడా రావడం లేదని స్థానికులు వాపోతున్నారు.

అపరిశుభ్రంగా ఉన్న నీరు తాగడం వల్ల తమకు రోగాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నీటి సమస్య పరిష్కారానికి ఇప్పటికే జల వనరుల శాఖ అధికారులతో ప్రస్తుత చర్చించామని పురపాలక శాఖ కమిషనర్ తెలిపారు. కాలువల ద్వారా నీటి విడుదల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు. ముందస్తు చర్యల విషయంలో విఫలమైన మున్సిపల్ అధికారులు వారం రోజులుగా నీటి కష్టాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఇది పెద్ద ఇబ్బంది కాదని కొట్టిపడేస్తున్నారు.

స్థానికులు మాత్రం తమకు ప్రతి ఏడాది నీటి ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Intro:ap_vja_23_raitu_mruthi_avb_c5. నష్ట పరిహారం అందడం లేదు అంటూ మనస్తాపం చెందిన రైతు ఆందోళనతో గుండెపోటుతో మృతి కృష్ణా జిల్లా ముసునూరు మండలం సింహాద్రిపురం చెందిన గణపవరపు మోహన్ రావు అనే రైతు నూజివీడు మండలం మీర్జాపురం వద్ద ఉన్న సిపి కంపెనీ వద్ద నుంచి గత సంవత్సరం మొక్కజొన్న విత్తనాలు తీసుకుని పంట వేయగా పంట వేసిన విత్తనాలు నకిలీ అవడంతో పంట దిగుబడి రాకపోవడంతో సి పి కంపెనీని ఆశ్రయించగా వారు నష్టపరిహారం కింద ఎకరాకు 62500 ఇస్తామని హామీ ఇచ్చారు ఎన్నిసార్లు లు సి పి కంపెనీ ముందు ధర్నా నిర్వహించిన హామీలు కే పరిమితం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురి అవుతూ వచ్చారు దీంతో గత రాత్రి తీవ్ర మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందారు ఇప్పటికైనా నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు రైతు నాయకులు రైతులు కోరుకుంటున్నారు. బైట్స్ 1) రైతు కుమార్తె 2) రాజు సిపిఐ లీడర్ 3) రైతు. ( గమనిక. .. పంపిన ఫైల్స్ లో కొన్ని పాత ఫైల్స్ ఉన్నాయి గమనించగలరు) ( కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)

Body:రైతు గుండెపోటుతో మృతి

Conclusion:రైతు గుండెపోటుతో మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.