కరోనా పై ఫ్రంట్ వారియర్స్ గా పనిచేసే వారిలో పారిశుద్ద్యకార్మికులూ ఉన్నారు. వారు చేసే సేవలు వర్ణనాతీతం...ప్రాణాలకు తెగించి సమాజాన్ని శుభ్రం చేస్తున్నారు. కానీ మనలో కొందరు మాత్రం వీరికి పనిభారాన్ని పెంచుతున్నాం...బయటకు రావద్దంటూ పోలీసులు మొత్తుకుంటుంటే అనవసరంగా రోడ్లెక్కి కాకీల లాఠీలకు బలయ్యాం..ఇప్పుడు పారిశుద్ధ్యకార్మికులు చేసే పనులు చాలవనట్లు తాగిపడేసిన నీళ్ల సీసాలను డ్రైనేజీల్లో పడేసి వారికి ఇంకా పనిని పెంచుతున్నాం.. నీళ్లుతాగిన సీసాలను విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందున్న డ్రైనేజీలోంచి తీస్తున్న ఈ దృశ్యం చూస్తే అర్ధమవుతోంది..సమాజంలో నువ్వు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నావో...
ఇదీ చూడండి