ETV Bharat / state

కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్‌ ఇంతియాజ్‌కు.. వారెంట్‌ జారీ - Krishna District Ex-Collector Intiaj

కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్‌ ఎండీ ఇంతియాజ్‌, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ (పీడీ) ఎం.శ్రీనివాసరావుపై హైకోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌.. ఈమేరకు ఆదేశాలిచ్చారు.

కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్‌ ఇంతియాజ్‌
కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్‌ ఇంతియాజ్‌
author img

By

Published : Jul 15, 2021, 4:44 PM IST

కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్‌ ఎండి ఇంతియాజ్‌, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌(పీడీ) ఎం.శ్రీనివాసరావుపై హైకోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌(ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. వారిరువుర్ని అదుపులోకి తీసుకొని కోర్టు ఎదుట హాజరుపరచాలని విజయవాడ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. ఈనెల 28కి విచారణను వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ బుధవారం ఈమేరకు ఆదేశాలిచ్చారు.

అర్హత ఉన్నా ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం తమకు వర్తింపచేయడం లేదంటూ కృష్ణా జిల్లా చందర్లపాడు గ్రామానికి చెందిన 20 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు హైకోర్టును ఆశ్రయించారు. వారికి ప్రయోజనాలు కల్పించాలని గత ఏడాది అక్టోబరు 22న హైకోర్టు అధికారులకు ఆదేశాలిచ్చింది. 2020-21 సంవత్సరానికి అధికారులు నిధులు మంజూరు చేశారు. 2019-2020 సంవత్సరానికి ప్రయోజనాలు కల్పించలేదని కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు.

కోర్టు ధిక్కరణ వ్యాజ్యం విచారణకు వస్తున్నందున ఇటీవల 2019-2020 సంవత్సర నిధులను సైతం విడుదల చేశారు. బుధవారం జరిగిన విచారణకు కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్‌, డీఆర్‌డీఏ పీవోలు హాజరుకాలేదు. వారి తరఫు న్యాయవాదులు సైతం హాజరుకాలేదు. దీంతో వారిపై కోర్టు ఎన్‌బీడబ్ల్యూ జారీచేసింది.

ఇదీ చదవండి:

Atchannaidu: 'ఈ సెక్షన్ ఇంకా మనుగడలోనే ఉందని.. సీఎం జగన్ ద్వారానే తెలిసింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.