ETV Bharat / state

నిత్యం రోడ్డు ప్రమాదాలు..పనులు త్వరగా పూర్తయితేనే అడ్డుకట్ట - ఈరోజు రహదారి విస్తరణ పనులు తాజా వార్తలువ

పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను నుంచి కృష్ణా జిల్లా గన్నవరం వరకు దాదాపు 50 కి.మీ దూరం ఉంది. ఇక్కడ దాదాపు 20 వరకు బ్లాక్‌స్పాట్‌లు ఉన్నాయి. రోజుకు సగటున ఈ రహదారిలో నాలుగు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సగటున ప్రతి రోజు ఒకరు మృతి చెందుతున్నారు. గన్నవరం నుంచి రామవరప్పాడు వరకు సగటున రెండు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకరు చొప్పున మృతి చెందుతున్నారు. జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణ, బైపాస్‌ పూర్తయితేనే ప్రమాదాలను నియంత్రించే అవకాశం ఉందని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

road works
road works
author img

By

Published : Apr 23, 2021, 1:53 PM IST

ఈ చిత్రాన్ని పరిశీలించారా..! ఇది 16వ నెంబరు (చెన్నై-కోల్‌కతా) జాతీయ రహదారి ఆరు వరసల విస్తరణ పనులు. కృష్ణా జిల్లాలో మూడో ప్యాకేజీగా ఏడాది క్రితం పనులు చేపట్టారు. శీఘ్రగతిన నిర్మాణం చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో చిన్నఅవుట్‌పల్లి నుంచి కలపర్రు వరకు రహదారి విస్తరణ, ఇతర నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. దాదాపు 89 శాతం పనులు పూర్తయ్యాయి. లక్ష్మీఇన్‌ఫ్రా సంస్థ దీని నిర్మాణం చేపట్టింది. ఈ ఏడాది మే నాటికి పూర్తి చేసి జాతీయ రహదారుల సంస్థకు అప్పగించనుంది.

బుధవారం హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని గన్నవరం, హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రెండు ప్యాకేజీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు గుత్త సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రహదారి విస్తరణలో మూడో ప్యాకేజీగా చిన్నఅవుట్‌పల్లి నుంచి గొల్లపూడి వరకు విజయవాడ బైపాస్‌ నిర్మాణం జరగనుంది. ఈ పనులు ప్రారంభమయ్యాయి. నాలుగో ప్యాకేజీలో గొల్లపూడి నుంచి కాజా వరకు కృష్ణా నదిపై వంతెనతో సహా నిర్మాణం చేయాల్సి ఉంది. ఇవి ప్రారంభం కావాల్సి ఉంది.

త్వరితగతిన రెండో ప్యాకేజీ..!

ఇదే జాతీయ రహదారి విస్తరణలో రెండో ప్యాకేజీగా కలపర్రు నుంచి చిన్నఅవుట్‌ పల్లి వరకు ఉంది. దీన్ని లక్ష్మీఇన్‌ఫ్రా దక్కించుకుంది. దీని అంచనా వ్యయం రూ.707కోట్లు కాగా రూ.503కోట్లకు చేజిక్కించుకుంది. 2019 ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించింది. శీఘ్రగతిన నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికి 89 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 27.4 కి.మీ దూరం ఉంది. రెండు పైవంతెనలు హనుమాన్‌ జంక్షన్‌ ప్రారంభం, చివరలో నిర్మాణం చేయాల్సి ఉంది. హనుమాన్‌ జంక్షన్‌ వద్ద బైపాస్‌ నిర్మాణం ఉంది. వాహన అండర్‌ పాస్‌లు 13, మైనర్‌ వంతెనలు 5, ట్రక్కుబేలు ఒకటి, ఒక టోల్‌ప్లాజా కలపర్రు వద్ద నిర్మాణం చేయాల్సి ఉంది. మొత్తం ఆరు వరుసల రహదారిలో ఒకవైపు 12.5 మీటర్లు, మరోవైపు 12.5 మీటర్లు నిర్మాణం చేశారు. బీటీ కూడా పూర్తి చేస్తున్నారు. హనుమాన్‌ జంక్షన్‌ వద్ద బైపాస్‌ నిర్మాణంలో ఓ అధికార పార్టీ నేత భూమి విషయంలో కొర్రీ వేయడంతో అక్కడ కొంత జాప్యం జరిగింది. ఉన్నత స్థాయిలో దీన్ని పరిష్కరించారు. ఈ ఏడాదే మే నెలలో ఈ ప్యాకేజీ రహదారి అందుబాటులోకి వస్తుందని లక్ష్మీఇన్‌ఫ్రా ప్రాజెక్టు మేనేజర్‌ రవికాంత్‌ ‘ఈనాడు’తో చెప్పారు. దీంతో చాలా వరకు రోడ్డు ప్రమాదాలకు చెక్‌ పడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

జాతీయ రహదారి విస్తరణలో తొలి ప్యాకేజీ గుండుగొలను నుంచి కలపర్రు వరకు నిర్మాణం చేస్తున్నారు. ఇది నత్త నడకన సాగుతోంది. ప్రస్తుతం జాతీయ రహదారి నాలుగు వరుసలను ఆరు వరసలు (25 మీటర్లు)గా విస్తరించాల్సి ఉంది. మొదట బీఓటీ కింద చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మూడుసార్లు ఈపీసీ టెండర్లను పిలిచి నాలుగోసారి ఖరారు చేశారు. తొలిప్యాకేజీ అంచనా వ్యయం రూ.648 కోట్లు కాగా వరాహ ఇన్‌ఫ్రా సంస్థ రూ.514 కోట్లకు దక్కించుకుంది. 2019 ఫిబ్రవరిలో టెండర్లను ఖరారు చేశారు. తక్కువకు వేసిన ఈ సంస్థ కొంత కాలం పనులు చేపట్టేందుకు ఊగిసలాడింది. దీంతో 2020 మార్చిలో కరోనా ప్రభావం పడింది. కార్మికులు లభించలేదు. పలుమార్లు ఎన్‌హెచ్‌ఏఐ నుంచి నోటీసులు జారీ చేశారు. ఒక దశలో పనులు వదులుకునేందుకు సంస్థ సిద్ధపడినట్లు తెలిసింది. మొత్తం 27.4 కి.మీ దూరం ఆరు వరుసల రహదారితో పాటు రెండు పైవంతెనలను నిర్మాణం చేయాల్సి ఉంది. కలపర్రు ప్రారంభంలో ఒకటి, ఆశ్రమ పాఠశాల వద్ద ఒకటి నిర్మాణం చేయాల్సి ఉంది. కరోనా తర్వాత తుపాను వర్షాల ప్రభావం మరింత జాప్యానికి కారణమైంది. దీంతో ఈ ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలతో పలు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రహదారి తవ్వి వదిలేశారు. కార్లు, ద్విచక్ర వాహనాలు ఈ గోతుల్లో పల్టీలు కొట్టాయి. పలువురు గాయపడ్డారు. గత కొంతకాలంగా పనుల్లో వేగం పెంచారు. 2022 జులై నాటికి పూర్తి చేస్తామని సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌ చారి చెప్పారు. ఇటీవల పనులు ప్రారంభించామని, కరోనా వల్ల ప్రభావం పడిన విషయం వాస్తవమేనన్నారు.

తొలి ప్యాకేజీపై కరోనా ప్రభావం..

ఇదీ జాతీయ రహదారి విస్తరణ పనులే. ఇది మొదటి ప్యాకేజీ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. కలపర్రు నుంచి గుండుగొలను గ్రామం వరకు ఆరు వరుసల విస్తరణ, ఇతర నిర్మాణాలు చేయాల్సి ఉంది. వరాహ ఇన్‌ఫ్రా సంస్థ దీని టెండర్‌ దక్కించుకుంది. పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికి కేవలం 22 శాతం పూర్తయ్యాయి. 2022 జులై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇవీ చూడండి…

రోడ్లపై తిరుగుతున్న కొవిడ్ రోగులు..కారణం అదే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.