విజయవాడలో శ్రీరామకృష్ణ సమితికి చెందిన శారదా విద్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యాలయం స్థలం లీజు గడువు పూర్తైనందున మున్సిపల్ అధికారులు స్వాధీనానికి ప్రయత్నించారు. పాఠశాల యాజమాన్యం 1981లో 39 సంవత్సరాలకు స్థలం లీజుకు తీసుకుంది. నేటితో గడువు పూర్తవ్వడంతో స్థలం స్వాధీనానికి మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు.
పిల్లల భవిష్యత్తు చూడలంటూ నిర్వాహకులు అధికారులను వేడుకున్నారు. కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో చర్చలు జరుపుతామని..ఆ తరువాత స్పందించాలని పాఠశాల యాజమాన్యాన్ని కోరింది. దీంతో అధికారులు గడువు ఇచ్చి అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఇదీ చదవండి: కేజీహెచ్‌లో ప్రతీ పడకకు ఆక్సిజన్ సదుపాయం