విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న రెండు దుకాణాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. జులై 7న బీఆర్టీఎస్ రోడ్ లోని నవభారత్ నెయ్యి, న్యూనవభారత్ నెయ్యి అనే రెండు దుకాణాలపై... విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. దుకాణాల్లోని నెయ్యి నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపగా... అవి కల్తీ అని రిపోర్ట్ లో తేలటంతో పోలీసులు ఆ రెండు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. నిందితులకు రూ.5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: