ETV Bharat / state

'సైకిల్ స్పీడ్ ఇక ఆపలేరు..!' రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ల విజయోత్సాహం

Celebrations of Telugu Desam : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధ గెలుపుతో తెలుగుదేశం శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచి సందడి చేశారు. సైకిల్‌ స్పీడ్‌ను ఇక ఆపలేరని, వచ్చే ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

తెలుగు తమ్ముళ్ల విజయోత్సాహం
తెలుగు తమ్ముళ్ల విజయోత్సాహం
author img

By

Published : Mar 24, 2023, 7:11 AM IST

Updated : Mar 24, 2023, 10:13 AM IST

Celebrations of Telugu Desam : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయంపై పసుపుదళం సంబరాలు చేసుకుంది. శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో నేతలు బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేశారు. విజయనగరంలో టీడీపీ కార్యాలయం నుంచి ర్యాలీ చేశారు. రాజాంలో మాజీ మంత్రి కోండ్రు మురళీ ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు.

విశాఖలో టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కేక్ కట్‌ చేశారు. వైఎస్సార్ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ జగదీశ్‌ కార్యకర్తలకు మిఠాయిలు పంచారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో టపాసులు పేల్చగా... వాడపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి శ్రేణులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు.

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట బంగారుకొట్ల సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య ఆధ్వర్యంలో సంబరాలు చేయగా.. నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. తిరువూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద టపాసులు పేల్చారు. అవనిగడ్డ రాజీవ్ గాంధీ సెంటర్‌లో బాణసంచా కాల్చారు. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు, కంకిపాడులో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుకున్నారు.

గుంటూరు లాడ్జి సెంటర్లో తెదేపా శ్రేణులు టపాసులు కాల్చేందుకు యత్నించగా పోలీసులు లాక్కోబోవడం ఉద్రిక్తతకు దారితీసింది. మంగళగిరి, దుగ్గిరాలలో తెలుగు తమ్ముళ్లు పార్టీ జెండాలు చేతబట్టి డప్పులు వాయిస్తూ డ్యాన్సులు చేశారు. తెనాలిలోనూ కేక్ కట్ చేసి పంచుకున్నారు. కాకుమాను మండలం కొమ్మూరులో సంబరాలు జరిగాయి. పల్నాడు జిల్లా వినుకొండ లాయర్ స్ట్రీట్‌లో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో స్వీట్లు పంచారు.

బాపట్ల జిల్లా అద్దంకి బంగళా రోడ్డులో టీడీపీ అభిమానులు బాణా సంచా పేల్చారు. జె.పంగులూరులో వేడుకలు జరిగాయి. ఒంగోలులో పార్టీ కార్యాలయం నుంచి విజయోత్సవ ర్యాలీ తీశారు. కనిగిరి, హనుమంతునిపాడు, పామూరులోనూ సంబరాలు అంబరాన్నంటాయి.

వైఎస్సార్ జిల్లా కడపలో... టీడీపీ కార్యకర్తలు, నాయకులు .. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ పతనం ప్రారంభమైందంటూ అనంతపురంలో టీడీపీ శ్రేణులు కేకులు కట్‌ చేశారు. కళ్యాణదుర్గంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మిఠాయిలు పంచుకున్నారు.

కర్నూలులో టీజీ భరత్, సోమిశెట్టి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. ఆదోనిలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. తిరుపతి ఎన్టీఆర్‍ కూడలి వద్ద టపాకాయలు పేల్చారు. పలమనేరులో విజయోత్సవం జరిపారు. తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై ర్యాలీ తీశారు. మిఠాయిలు పంచుకొని టపాసులు పేల్చారు.

తెలుగు తమ్ముళ్ల విజయోత్సాహం

ఇవీ చదవండి :

Last Updated : Mar 24, 2023, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.