విజయవాడలోని రెడ్‌జోన్ ప్రాంతమైన భవానీపురంలో తక్కువ ధరలకే పండ్లు, కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. కేవలం రూ.100 కే 4 రకాల పండ్లు లేదా 8 రకాల కూరగాయల కిట్‌ను అందించనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. ప్రభుత్వం కరోనా నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రులు స్పష్టం చేశారు. రైతు ఉత్పత్తి సంఘాల నుంచి పండ్లు, కూరగాయలను సేకరించినట్లు ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి అన్నారు. పండ్లు, కూరగాయల కిట్ల అమ్మకాల్లో స్థానికంగా ఉన్న మహిళా సంఘాలు, ఎన్జీవోలను భాగస్వామ్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని.. పోలీసులు, అధికారులకు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: