ETV Bharat / state

'వాసవ్య'.. మహిళల ఉపాధికి చిరునామా - విజయవాడ

ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడంలో మహిళలు ముందు నిలుస్తున్నారు. తమ నైపుణ్యంతో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. అయినా.. కొందరు మహిళలు ఉన్నతస్థానానికి చేరుకోవడంలో విఫలమవుతున్నారు. పిల్లల పెంపకమో.. కుటుంబ బాధ్యతలో.. సామాజిక పరిస్థితులో.. కారణం ఏదైనా.. ఉద్యోగ జీవితాన్ని చాలామంది ప్రతిభావంతులైన మహిళలు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లలేకపోతున్నారు. అలాంటి వారికి చీకటిలో వెలుగురేఖలా భరోసా కల్పిస్తోంది... వాసవ్య సంస్థ.

'వాసవ్య'.. మహిళల ఉపాధికి చిరునామా
author img

By

Published : Apr 18, 2019, 12:02 PM IST

'వాసవ్య'.. మహిళల ఉపాధికి చిరునామా

ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా... కుటుంబాన్ని నడిపించాలన్నా.. ప్రస్తుత సమాజంలో ఒక్కరి సంపాదనతో సాధ్యమయ్యే పనికాదు. మధ్యతరగతి కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తేనే గానీ.. కాలంతో పాటు పరిగెత్తలేరు. ఆర్థిక అవసరాలు తీర్చుకోలేరు. ఈ కారణంతోనే.. భర్తతో పాటు.. భార్య కూడా ఉద్యోగానికి వెళ్తుండడం ఈ కాలంలో మామూలైపోయింది. ఇదే సమయంలో.. కుటుంబ బాధ్యతల కోసం ఉద్యోగాన్ని మధ్యలో వదిలేస్తున్న మహిళల సంఖ్యా పెరుగుతోంది. ఇంకొందరు మహిళలైతే.. ఉద్యోగం చేసేందుకు అనుకూల పరిస్థితులు లేక.. కుటుంబం కోసం ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇలాంటి వారి కోసమే.. కృష్ణా జిల్లా విజయవాడలోని వాసవ్య మహిళా మండలి విశేష కృషి చేస్తోంది. మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తోంది. స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని పొందేందుకు దారి చూపిస్తోంది.

తీరిక సమయాలు.. ఉపాధికి బాటలు

స్క్రీన్ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీ, అల్లికలు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, త్రెడ్ జ్యూయలరీ.. ఇలా.. మహిళలు ఉత్సాహం చూపే ఎన్నో విషయాల్లో వాసవ్య సంస్థ శిక్షణ ఇప్పిస్తోంది. ఇంట్లోనే ఉంటూ.. తీరిక సమయాల్లోనే పని చేసుకునేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని.. నైపుణ్యాన్ని అందిస్తోంది.

అందుబాటు సమయాల్లోనే శిక్షణ

హడావుడిగా శిక్షణ ఇవ్వడం కాకుండా.. మహిళల అనుకూలతలు, వారికి ఉండే వెసులుబాటు ఆధారంగా వాసవ్య మహిళా మండలి నిర్వాహకులు.. శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు.. టైలరింగ్​ కోర్సు తీసుకుంటే.. త్వరగా నేర్చుకునే వీలున్న వారికి 15 రోజుల నుంచి నెలపాటు శిక్షణ ఇస్తారు. ఇది వీలు కాని వారికి 2 నెలల నుంచి 3 నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఇలా.. నేర్చుకున్న వారంతా.. తదుపరి బ్యాచ్​లకు ట్రైనింగ్ ఇస్తారు.

రూరల్ మార్ట్​ వేదికగా అమ్మకాలు.. లాభాలే లాభాలు

స్వయం ఉపాధి కోసం శిక్షణ తీసుకోవడం ఒక ఎత్తైతే... ఇంటి వద్ద తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించడం మరో ఎత్తు. నాబార్డ్ సహకారంతో వాసవ్య మహిళా మండలి రూరల్ మార్ట్ ను ఏర్పాటు చేసింది. ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు... వాళ్లు తయారు చేసిన బ్యాగులు, ఆభరణాలు, సౌందర్య సాధనాలు, వస్త్రాలు, గృహోపకరణ వస్తువులు ఈ మార్ట్ ద్వారా ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు. మంచి లాభాలూ పొందొచ్చు.

ఇలా... ఎంతోమంది మహిళలకు ఉపాధి బాట చూపిస్తూ... వారిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తున్న వాసవ్య లాంటి సంస్థలు.. మరిన్ని రావాల్సిన అవసరం ఉంది.

Intro:AP_TPG_06_17_MP_MAGANTI_BABU_PRESSMEET_AVB_C2నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) మొన్న జరిగిన పోలింగ్ లో మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటింగ్ వేశారంటే అది ఇది తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం అని నూటికి నూరుశాతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి అధికారంలోకి రావడం తథ్యమని తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Body:ప్రతిసారి ప్రతిపక్ష పార్టీ నాయకులు అవినీతి అంటున్నారని అది చేసే వాళ్ళకి తెలుస్తుంది అవినీతి గురించి అని విమర్శించారు. జైలు కు వెళ్లలేదా ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు ఇన్ని రోజులు ప్రజల మధ్యే ఉన్నారు అసెంబ్లీ కి వచ్చారా ప్రజల గురించి ప్రజల సమస్య గురించి మాట్లాడటం లేదు ఎంతసేపు టార్గెట్ చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రంలో లో బిజెపి పార్టీకి 150 సీట్లు వస్తే గొప్ప అని ఆయన జోస్యం చెప్పారు. రెండు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం, అమలు చేయవలసిన 18 అంశాలు ఎంపీలందరు పోరాటం రాబోయే కేంద్ర ప్రభుత్వం తో అన్ని పార్టీల కలిపి రాష్ట్రానికి ఏం చేయాలో ఏం సాధించాలో చంద్రబాబు నాయుడికి ఒక మాస్టర్ ప్లాన్ ఉందని అన్నారు.

Conclusion:ఇవి మనలో ఇవి పాటలు మొరాయించడం లో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. సరైన పద్ధతిలో ఓటర్లు ఓటు వేసిన తరువాత తీర్పు ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుస్తుంది అన్నారు. తెలుగుదేశం పార్టీకి 135 సీట్లు తక్కువ కాకుండా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చక్రం తిప్పుతుందని ఆయన తెలిపారు.
బైట్. మాగంటి బాబు ఏలూరు పార్లమెంట్ సభ్యుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.