ETV Bharat / state

రోడ్డుపైనే వర్మ మీడియా సమావేశం..... అడ్డుకున్న పోలీసులు

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటుకు యత్నించిన రాంగోపాల్ వర్మను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేనందున ఆయన సమావేశానికి పోలీసులు నిరాకరించారు.

పోలీసులతో వర్మ వాగ్వాదం
author img

By

Published : Apr 28, 2019, 3:54 PM IST

వర్మను అడ్డుకున్న పోలీసులు
కృష్ణా జిల్లా గన్నవరంలో సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ..ఎన్నికల కారణంగా రాష్ట్రంలో విడుదల కాలేదు. ఇప్పుడు ఎన్నికలు పూరైనందున మే 1న సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం సమాయత్తమైంది. సినిమా విడుదలకు సంబంధించి విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని వర్మ ప్రకటించారు. అయితే మీడియా సమావేశానికి ఆ హోటల్ సిబ్బంది అనుమతి నిరాకరించారు. దీనితో బహిరంగంగానే మాట్లాడడానికి వర్మ సిద్ధమయ్యారు. సాయంత్రం రోడ్డుపై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండటం వల్ల ప్రెస్‌మీట్ వద్దంటూ పోలీసులు...రామ్‌గోపాల్ వర్మను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున బహిరంగ సమావేశాలకు అనుమతి లేదంటూ నిలువరించారు. హోటళ్లు, క్లబ్బుల యాజమాన్యాలు ఓ వ్యక్తికి భయపడి విలేకరుల సమావేశానికి అనుమతి ఇవ్వడం లేదంటూ వర్మ ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మ, నిర్మాత రాకేశ్ రెడ్డి, పోలీసుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు వర్మ, నిర్మాత రాకేశ్ రెడ్డిని గన్నవరం విమానాశ్రయానికి తరలించారు.

Intro:ATP:- ఈ నెల 30వ తేదీన జరుగుతున్న ఏపీ సెట్ లో కొన్ని మార్పులు చేశామని ఈ మార్పును గమనించి అభ్యర్థులు సహకరించాలని అనంతపురం జిల్లా జెఎన్టియు విసి శ్రీనివాస కుమార్ కోరారు. ఇవాళ ఆయన జెఎన్టియులో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు వేల వివిఎం ప్యాడ్ లను జె.ఎన్.టి.యు కొన్ని ప్రాంతాల్లో భద్రపరచడం వల్ల 1100 మంది విద్యార్థులను హైదరాబాదులో సెంటర్లకు మార్చారన్నారు. అభ్యర్థులు గమనించి సహకరించాలని కోరారు.

Body:పరీక్షకు ఉదయం తొమ్మిది గంటలకి చేరుకోవాలని సెల్ ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి ఇవ్వమని తెలిపారు. మహిళలు చేతులకు మెహేంది వంటి రంగులు ఉండకూడదని తెలిపారు. సుదూర ప్రాంతాల అభ్యర్థులకు బస్సు చార్జీలు అంశంపై సంబంధిత బోర్డు నెంబర్ లతో మాట్లాడి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
బైట్.... శ్రీనివాస్ కుమార్, జె ఎన్ టి యు, విసి అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈ టీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.