కృష్ణాజిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ ఛైర్మన్‌గా వల్లభనేని సత్యనారాయణ(నాని) ప్రమాణ స్వీకారం చేశారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్ల చేత గుడివాడ ఆర్డీఓ, ప్రత్యేక అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా.. ఉయ్యూరు వీరమ్మ తల్లి గుడి దగ్గర నుంచి నగర పంచాయతీ కార్యాలయం వరకు వైకాపా నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. ఉయ్యూరు పురపాలక సంఘం కమిషనర్ జి. శ్రీను కుమార్, ఇంఛార్జ్ కమిషనర్‌తో పాటు పలువురు అధికారులు ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన వారికి ఎమ్మెల్యే పార్థసారథి అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: