మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా తదితర ప్రాంతాలపై ఆవరించిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా అరేబియా సముద్రంలోకి వెళ్లి మళ్లీ బలపడి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో మహారాష్ట్ర, గోవా, గుజరాత్ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తరకోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా అరేబియా సముద్రం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల పొడి వాతావరణం నెలకొన్నప్పటికీ.. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడు రోజుల్లో రాయలసీమలోనూ కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని స్పష్టం చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు...
ప్రాంతం | నమోదైన ఉష్ణోగ్రత (డిగ్రీల్లో) |
విజయవాడ | 33 |
విశాఖపట్నం | 31 |
తిరుపతి | 37 |
అమరావతి | 37 |
గుంటూరు | 35 |
కర్నూలు | 32 |
రాజమహేంద్రవరం | 29 |
కాకినాడ | 30 |
నెల్లూరు | 38 |
రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన వర్షపాతం
ప్రాతం | నమోదైన వర్షపాతం (సెం.మీ) |
అమలాపురం | 9.1 |
నరసన్నపేట | 5.1 |
ముమ్మిడివరం | 4.3 |
పోడూరు | 3.6 |
బొబ్బిలి | 2.4 |
తొట్టంబేడు | 2.1 |
నూజివీడు | 1.7 |
నాగులుప్పలపాడు | 1.4 |
బాలయపల్లె | 1.0 |
ఇదీచదవండి.
ఇదీ చదవండి