Union Minister Bhagwant Khuba : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో బీజేపీ రాష్ట్ర శాఖ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమరావతే రాజధానిగా కొనసాగాలనేదే తమ పార్టీ ఆలోచనగా కేంద్ర రసాయనాలు, ఎరువులశాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల ఆలోచన ఆ పార్టీ వ్యవహారంగా తోసిపుచ్చారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు వారిని ఆహ్వానించి మాట్లాడడం ప్రజాస్వామ్యంలో సహజమని.. ఏపీ సీఎం విషయంలోనూ ఇదే జరుగుతోంది మినహా అంతకు మించి ప్రత్యేక ప్రాధాన్యం ఏమీ లేదని అన్నారు.
నాలుగేళ్ల వైఎస్సార్సీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. ఆర్థిక పరిస్థితులు అంత అధ్వాన్న స్థితికి చేరాయని పేర్కొన్నారు. ఖజానా లోటుతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని... కొత్త పెట్టబడులు రావడం లేదని చెప్పారు. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించి తొమ్మిదేళ్లు అవుతున్నందున బీజేపీలోని వివిధ విభాగాల ప్రతినిధులతో ముఖాముఖిగా మాట్లాడేందుకు ఒకరోజు పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి ఖుబా మీడియాతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
వీడియో కాల్లో స్క్రీన్ షేరింగ్.. వాట్సాప్‌లో సూపర్ ఫీచర్!
వచ్చే ఎన్నికల్లో భారీ విజయం.. కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా మూడు వందలకుపైగా స్థానాల్లో ఒంటరిగా గెలుస్తుందని.. మిత్రపక్షాలతో కలిసి అతి బలమైన పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ బలం పెరిగిందని... తెలంగాణాలో ఎనిమిది నుంచి పది స్థానాలు... తమిళనాడులో 15కుపైగా సీట్లు, కేరళలో నాలుగు నుంచి ఐదు సీట్లు... ఏపీలోనూ నాలుగు చోట్ల విజయం సాధిస్తామన్నారు. ఇందుకు తమ వద్ద ఉన్న వ్యూహాలను అవసరమైన సమయంలో బయటపెడతామన్నారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీకైనా వారి ఆలోచనలు ఏవైనా.. దేశం అనేది వారి తొలి ప్రాధాన్యంగా ఉండాలని.. కానీ, ముఖ్యమంత్రులు కేసీఆర్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ తదితరులు అందుకు భిన్నమైన వాదనలతో ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు.
ఒకే కుటుంబంలో 10 మంది మృతి.. మైసూర్ ట్రిప్‌లో విషాదం
కర్నాటకలో బీజేపీ ఓటమికి అనేక అంశాలు కారణాలుగా ఉన్నాయని చెప్పారు. బీజేపీకి ఆ రాష్ట్రంలో ప్రజాదరణ తగ్గలేదని.. ఇతర పార్టీల ఓటు కాంగ్రెస్‌కి వెళ్లిందన్నారు. ఈ ఫలితాలను ఎవరూ ఊహించలేదని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉందని.. వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేస్తామన్నారు. ఇతర అంశాలు ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. కరోనా వంటి తీవ్రమైన విపత్తు యావత్ ప్రపంచాన్ని అస్తవ్యస్థం చేసినా.. భారత్ ఒక్కటే ఆర్థికంగా స్థిరత్వం సాధించగలిగిందన్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం కారణంగానే చమురు ఉత్పత్తులు, సహజ వాయువుల ధరల్లో పెరుగుదల కనిపిస్తోందని.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఈ ప్రభావం మన దేశంలో తక్కువేనని చెప్పారు.
రైతు సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని.. కేంద్ర ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోని రాష్ట్రాలు మోదీ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నాయన్నాయని ఖుబా అన్నారు. రైతు సంఘాల విజ్ఞప్తి మేరకు వారి ప్రయోజనం కోసం తీసుకొచ్చిన మూడు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుందన్నారు.
Wife Conduct Her Husband Final Rites: అకస్మాత్తుగా భర్త మృతి.. ఇంట్లోనే దహనం చేసిన భార్య