కృష్ణా జిల్లా గన్నవరం మండలం జక్కులనెక్కలం గ్రామానికి నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానశ్రయం చేరుకున్న తర్వాత జక్కులనెక్కలంలోని వ్యవసాయక్షేత్రంలో రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రంలో..., సాయంత్రం 4 గంటలకు భాజపా ఆధ్వర్యంలో కొత్త వ్యవసాయ బిల్లుల గురించి రైతులు, వ్యవసాయ నిపుణలతో జరిగే చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్సీ మాధవ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మట్టా ప్రసాద్, జిల్లా మాజీ అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి పరిశీలించారు.
వ్యవసాయ ఆధారిత దేశంగా తీర్చిదిద్దేందుకు..
రైతులకు చారిత్రాత్మక బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత భారత్‌ను వ్యవసాయ ఆధారిత దేశంగా తీర్చిదిద్దేందుకు చొరవ తీసుకుంటామని మాధవ్ తెలిపారు. రైతులు పండించే పంటని ఎక్కడయినా అమ్ముకునే విధంగా వారికి అవకాశం కల్పించిందన్నారు. మార్కెట్ యార్డ్‌లోనే అమ్ముకోవాలి అనే నిబంధన బిల్లును తొలగించామని ఆయన స్పష్టం చేశారు.
ఎక్కడైనా అమ్ముకునేలా..
పండించిన పంటకు సరైన మద్దతు ధర లభించేలా పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునేలా అవకాశం కల్పించామన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే అమ్ముకోవాలి అనే నిబంధనలు లేవని చెప్పారు. ఎంఎస్పీకి తక్కువ కాకుండా అమ్ముకునే ప్రయత్నం చేయడం, రైతులకి ఇచ్చిన బిల్లు చారిత్రాత్మక బిల్లుగా ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.