ETV Bharat / state

AP UNEMPLOYMENT RATIO: దేశవ్యాప్తంగా పెరిగిపోయిన నిరుద్యోగం.. ఏపీలో 6.5, తెలంగాణలో 4.7 శాతం - ap latest news

దేశవ్యాప్తంగా ఆగస్టులో నిరుద్యోగం ఎక్కువగా పెరిగిపోయింది.ఎన్నడూ లేనివిధంగా 8.2 శాతానికి పడిపోయింది. అలాగే ఆంధ్రప్రదేశ్​లోనూ నిరుద్యోగ శాతం 6.5, తెలంగాణలో 4.7 శాతంగా నమోదైంది.

unemployment-has-risen-across-the-india-dot-6-dot-5-per-cent-in-ap-and-4-dot-7-per-cent-in-telangana
దేశవ్యాప్తంగా పెరిగిపోయిన నిరుద్యోగం.. ఏపీలో 6.5, తెలంగాణలో 4.7 శాతం
author img

By

Published : Sep 3, 2021, 7:32 AM IST

దేశవ్యాప్తంగా ఆగస్టులో నిరుద్యోగం పెరిగిపోయింది. సంఘటిత, అసంఘటిత రంగాలు రెండింటిలోనూ కలిపి ఆ ఒక్క నెలలోనే దాదాపు 16 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఫలితంగా నిరుద్యోగ శాతం 8.2%కి చేరింది. గత 12 నెలల సమాచారాన్ని పరిశీలిస్తే మే (11.90%), జూన్‌ (9.17%) తర్వాత అత్యధిక నిరుద్యోగ రేటు నమోదైంది ఇప్పుడే. ఆగస్టులో పట్టణ ప్రాంతాల్లో 9.8%, గ్రామీణ ప్రాంతాల్లో 7.4% మేర నిరుద్యోగం నమోదైనట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజాగా విడుదల చేసిన లెక్కలు పేర్కొన్నాయి. గత నెలలో ఆంధ్రప్రదేశ్‌లో 6.5% నిరుద్యోగం నమోదైంది. తెలంగాణలో 4.7% నిరుద్యోగిత నమోదైంది. ఈ సంస్థ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జులైలో దేశంలో 39.938 కోట్ల ఉద్యోగాలుండగా, ఆ సంఖ్య ఆగస్టు నాటికి 39.778 కోట్లకు పడిపోయింది.

ఒక్క నెలలో నిరుద్యోగ రేటు 6.95% నుంచి 8.32%కి పెరిగిపోయింది. జులై-ఆగస్టు మధ్యకాలంలో నిరుద్యోగ రేటు పట్టణ ప్రాంతాల్లో 8.30% నుంచి 9.78%కి గ్రామీణ ప్రాంతాల్లో 6.34% నుంచి 7.64%కి ఎగబాకింది. ఈసారి వర్షాలు సకాలంలో కురవక ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం తగ్గడంతో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం 1.3% మేర పెరిగింది. సీఎంఐఈ సమాచారం ప్రకారం మొత్తం శ్రామిక శక్తి పరిమాణం ఆగస్టు నాటికి 43.38 కోట్లకు చేరింది. ఇది జులైలో కనిపించిన దానికంటే 40 లక్షలు అధికం. దీన్నిబట్టి ఎక్కువ మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోందని సీఎంఐఈ తెలిపింది. గత కొన్నేళ్లుగా దేశంలో ఉద్యోగ వాతావరణం సంక్లిష్టంగా మారుతోంది. కొవిడ్‌ తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నా, ఉద్యోగ మార్కెట్‌ ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

నిరుద్యోగిత ఎక్కువ, తక్కువగా ఉన్న రాష్ట్రాలు

ఇదీ చూడండి: ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలేవీ?... నిధుల కోసం పంచాయతీల ఎదురుచూపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.