ETV Bharat / state

డివైడర్​ను ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. ఇద్దరు యువకులు మృతి - కృష్ణా జిల్లా క్రైం వార్తలు

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్​ను ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. హనుమాన్ జంక్షన్ పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

two persons died after a bike hit to divider
డివైడర్​ను ఢీకొట్టిన ద్విచక్రవాహనం
author img

By

Published : Apr 21, 2021, 10:33 AM IST

Updated : Apr 21, 2021, 5:46 PM IST

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు మార్గమధ్యలోనే రోడ్డు ప్రమాదంలో బలయ్యారు. ఇద్దరు యువకులు.. శ్రీకాకుళం నుంచి విజయవాడకు బైక్‌పై వెళ్తున్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై డివైడర్​ను ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు విజయవాడకు చెందిన నాగరాజు, శ్రీకాకుళానికి చెందిన సత్యనారాయణ పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒకరు ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగి కాగా.. మరొకరి గురించి తెలియాల్సి ఉంది. హనుమాన్ జంక్షన్ పోలీసులు ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి

Last Updated : Apr 21, 2021, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.