ETV Bharat / state

నందివాడలో రోడ్డు ప్రమాదం- ఇద్దరు మృతి - road_accident

కృష్ణా జిల్లా నందివాడ శివయ్య పాకల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్వి చక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

నందివాడలో రోడ్డు ప్రమాదం- ఇద్దరు మృతి
author img

By

Published : Apr 26, 2019, 3:21 PM IST

Updated : Apr 29, 2019, 12:45 PM IST

కృష్ణా జిల్లా నందివాడ మండలం శివయ్య పాకల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని మహిళ సహా మరో వ్యక్తి మృతి చెందాడు. నాగేశ్వరమ్మ తన కుమారుడితో కలిసి హనుమాన్ జంక్షన్ నుంచి పెదపారపూడి వైపు వస్తుండగా... పుట్టగుంట నుంచి నాగబాబు, నవీన్ అనే ఇద్దరు యువకులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నాగేశ్వరమ్మ, నాగబాబు మృతి చెందారు. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను విజయవాడ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నందివాడలో రోడ్డు ప్రమాదం- ఇద్దరు మృతి

ఇవీ చూడండి- బైక్​ను ఢీకొట్టిన మినీవ్యాన్-భార్య మృతి

Intro:కనిపించని మామిడి
* తితిలీ తుపాను ధాటితో కోలుకోలేని దెబ్బ
* కాపు లేక కన్నీరు పెడుతున్న రైతులు

వేసవి సీజన్ వచ్చిందంటే చాలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మామిడి పంట విరగ కాసేది. బుట్టలతో మామిడి పండ్లను మార్కెట్కు తరలించి ఏడాదంతా పడ్డ కష్టాన్ని మర్చిపోయి ఆనందించేవారు రైతులు. గతేడాది వచ్చినతీతిలీ తుఫాను ధాటికి మామిడి రైతు వెన్ను విరిగిన తిరిగినట్లయింది. 20 ఏళ్లుగా పెంచుకున్న చెట్లు నేలకూలడంతో భవిష్యత్తుపై నీలి నీడలు అలముకున్నాయి. మరోవైపు తుఫాను ను తట్టుకొని నిలబడిన చెట్ల నుంచి ఆశించిన పూత లేకపోవడం , కాపు కానరాకపోవడంతో రైతులు మరింత వేదనకు గురవుతున్నారు.

Body:టెక్కలి నియోజకవర్గంలో ని టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల పరిధిలో 1,300 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఇక్కడ బంగినపల్లి, కలెక్టర్ , సువర్ణ రేఖ, చెరకు రసం రకాల మామిడి పంటను ఏటా పండిస్తున్నారు. స్థానికంగా విక్రయించగా మిగిలిన పళ్ళు ఒడిశా రాష్ట్రానికి రవాణా చేసేవారు. ఈ ఏడాది 80 శాతం వరకు దిగుబడి తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ప్రకృతి దెబ్బతో విల విల లాడి పోతున్న మామిడి రైతులకు తెగుళ్లు సైతం వేధిస్తున్నాయి. సూక్ష్మ పోషకాల లోపం తో మామిడి కాయలకు పగుళ్ళు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెంక పురుగు, పండు ఈగ తెగుళ్లతో పిందె దశ లోనే కాయలు పసుపు గా మారి రాలిపోతున్నాయని, మచ్చలు ఏర్పడి లోపలి భాగంలో కుళ్ళి పోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు

Conclusion:కొలుకోవడానికి మరో పదేళ్లు పడుతుందని, ఐదేళ్ల యినా ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలని అంతా కోరుతున్నారు. మామిడి మొక్కల కొనుగోలుకు ప్రభుత్వం సాయమందించాలని, రుణాలు రీ షెడ్యూల్ చేయాలని, తోటల్లో బోర్లు మంజూరు చేయాలని, ఎరువులు ఉచితంగా అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
Last Updated : Apr 29, 2019, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.