ETV Bharat / state

బందరు కాలువలో ఇద్దరు చిన్నారుల గల్లంతు..

author img

By

Published : Jan 22, 2021, 7:24 PM IST

అప్పటివరకు ఆనందంగా ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ప్రమాదశావత్తు ఒక్కసారిగా కాలువలో జారిపడి గల్లంతయ్యారు. ఈ ఘటన కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం బచ్చుపేట ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారుల ఆచూకీ కోసం ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

two children drowned in bandar canal
బందరు కాలువలో ఇద్దరు చిన్నారుల గల్లంతు

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు శివారు బచ్చుపేట ప్రాంతంలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బందరు కాలువలో పడి గల్లంతయ్యారు. మధ్యాహ్నం చిన్నారులిద్దరూ స్థానికంగా ఆడుకుంటుండగా ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. కాలువలో గల్లంతైన చిన్నారులు జస్వంత్, దిలీప్ కృష్ణగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఎమ్మార్వో తోట వెంకట సతీష్, ఎస్సై దుర్గారావు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు.

ఇదీ చదవండి: విగ్రహాల ధ్వంసం కేసులో ఏడుగురి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.