కృష్ణాజిల్లా సెలబోయినపల్లిలో విషాదం నెలకొంది. బహిర్భూమికి వెళ్లి ఇద్దరు బాలురు విగత జీవులయ్యారు. బావ బామ్మర్దులైన ప్రవీణ్, ప్రశాంత్ కుమార్ లు తాతగారి ఇంటికి వెళ్లారు. అక్కడినుంచి ఇంటి సమీపంలోని క్వారీ ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లారు. ఎంతకీ తిరిగి రాకపోయేసరికి కుటంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. గట్టుపైన ఇరువురి దుస్తులు ఉండటం గమనించిన స్థానికులు... పక్కనే ఉన్న 8అడుగుల నీళ్లున్న క్వారీ గోతిలో మృతదేహాలను గుర్తించారు. ఈ సంఘటనతో మృతుల తల్లిదండ్రులు, బంధువుల రోదన వర్ణనాతీతంగా మారింది.
ఇవీ చూడండి-ఆ తల్లిదండ్రులకు.. చివరి చూపు దక్కేనా?