ETV Bharat / state

ఇబ్బంది పడుతున్న మొక్కజొన్న, తెల్లజొన్న రైతులు

కృష్ణా జిల్లా చుండూరు మండలంలో మొక్కజొన్న, తెల్లజొన్న పంట కొనుగోలు నిమిత్తం ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికి ఇక్కడ మోదుకూరు కేంద్రం మినహా మిగతా చోట్ల కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. పంట అమ్ముకోవడానికి వివరాలు నమోదు చేసుకున్న రైతులు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొనుగోళ్లు ఎప్పుడు మొదలవుతాయని అన్నదాతలు ప్రశ్నిస్తే లారీల ఇబ్బంది ఉందని, గోతాలు రావాలనే సమాధానం చెప్తున్నారు అక్కడి సిబ్బంది. ఇక్కడే కాదు జిల్లాలో పలు చోట్ల పంట కొనుగోళ్లు మొదలు కాకపోవడానికి ఇవే కారణాలుగా చెప్తున్నారు.

farmers
మెుక్కజోన్న, జోన్న రైతులు
author img

By

Published : May 6, 2021, 1:42 PM IST

వ్యవసాయాధికారుల అంచనా ప్రకారం జిల్లాలో 47,676 హెక్టార్లలో తెల్లజొన్న, 34 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. ప్రస్తుతం పంట చేతికందడంతో అమ్ముకోవాలని వారు తహతహలాడుతున్నారు. అయితే ప్రభుత్వం మొక్కజొన్న, తెల్లజొన్న పంటలకు క్వింటాలుకు రూ.1850 చొప్పున ధర నిర్ణయించడంతో చాలా మంది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విక్రయించడానికి సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి కొంతమంది రైతు భరోసా కేంద్రాల వద్ద వివరాలను కూడా నమోదు చేసుకున్నారు.

  • చిరిగిన గోతాలే దిక్కు

వాస్తవానికి పంటను కేంద్రాల వద్దకు తీసుకువచ్చే రైతులకు గోతాలను అధికారులే అందించాలి. అయితే వారికి అందించే వాటిలో 30 శాతం చిరిగినవి ఉంటున్నాయని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇక కేంద్రాల వద్ద కొన్న పంటను గిడ్డంగులకు తరలించడానికి లారీలు సకాలంలో రావడం లేదు. దీంతో రైతుల వద్ద కొనుగోలు చేసిన పంటను కేంద్రాల వద్దే నిల్వచేయాల్సి వస్తోంది. అకాల వర్షాల కారణంగా పంట తడిసిపోయే ప్రమాదం ఉంది. ఇది ఇలా ఉంటే పంటను గిడ్డంగులకు తరలించడానికి వచ్చిన లారీల డ్రైవర్లు కరోనా పేరుతో బస్తాకు రూ.4 చొప్పున రైతుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.

  • నామమాత్రంగా కొనుగోళ్లు

మార్క్‌ఫెడ్‌ అధికారులు అందించిన వివరాల ప్రకారం గత నెల 20న జిల్లాలో 150 చోట్ల జొన్న, మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే వీటిలో వందకుపైగా కేంద్రాల్లో ఇంకా కొనుగోళ్లు ప్రారంభించిన దాఖలాలు లేవు. అక్కడక్కడ నామమాత్రంగా పంటను కొనుగోలు చేశారు.

అదనంగా డబ్బు ఇవ్వాల్సిన పనిలేదు

కరోనా నేపథ్యంలో పంట కొనుగోళ్లు కాస్త మందకొడిగా సాగుతున్నాయి. జిల్లాలోని వివిధ కేంద్రాల ద్వారా ఇప్పటికి 1500 టన్నుల తెల్లజొన్న, 500 టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేశాం. పంటను తరలించడానికి వచ్చే లారీల వారికి అదనంగా డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే ఒప్పందం చేసుకున్న గుత్తేదారులతో స్పష్టంగా చెప్పాం. చిరిగిన గోతాలు ఉంటే వాటిని పక్కన పెట్టి మంచి గోతాలు వాడుకోవచ్ఛు - రమేష్‌, జిల్లా మేనేజర్‌, మార్క్‌ఫెడ్‌, గుంటూరు

ఇదీ చదవండీ.. తెదేపా నేత ఇంటిపై వైకాపా నేతల దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.