విజయవాడ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఐటీడీఏ పీవోలు, ఇతర అధికారులతో మంత్రి పాముల పుష్పశ్రీవాణి సమీక్షించారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, కమిషనర్ రవీంద్రబాబు, ఇతర అధికారులు హాజరయ్యారు. గిరిజనాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీవాణి అన్నారు. జీసీసీ, ఇంజినీరింగ్ పనుల్లో గత ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతి బయటకు తీసి ప్రక్షాళన చేస్తామన్నారు. గిరిజనుల వైద్యానికి ఐటీడీఏ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గిరిజన విద్య మెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇవీ చదవండి.. వంటింటి మహారాణులు... నెట్టింట్లో విజేతలు