ETV Bharat / state

CM JAGAN TOUR: బెజవాడలో సీఎం పర్యటన.. ట్రాఫిక్ మళ్లింపు - ap latest news

సీఎం విజయవాడ పర్యటన దృష్ట్యా ట్రాఫిక్​ను మళ్లించారు. దీంతో సీతానగరం ప్రకాశం బ్యారేజీపై 3 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి.

traffice-diversion-problems-in-vijayawada
సీఎం పర్యటన దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు.. స్తంభించిన ట్రాఫిక్
author img

By

Published : Oct 2, 2021, 11:54 AM IST

సీఎం పర్యటన దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు.. స్తంభించిన ట్రాఫిక్

విజయవాడ బెంజ్ సర్కిల్‌లో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కోసం ట్రాఫిక్ మళ్లించటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సీతానగరం ప్రకాశం బ్యారేజీపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సాయిబాబా గుడి నుంచి బ్యారేజీ వరకు దాదాపు 3 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఒంగోలు వైపు నుంచి వచ్చే వాహనాలను చిలకలూరిపేట వద్దే దారి మళ్లించారు. ఫలితంగా చిలకలూరిపేట కూడలి వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

చిలకలూరిపేట నుంచి పర్చూరు, బాపట్ల, రేపల్లె, పెనుమూడి వారధి, అవనిగడ్డ మీదుగా వెళ్లేలా దారి మళ్లించారు. చిలకలూరిపేట నుంచి విజయవాడకు 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో అదనంగా మరో 80 కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడంతో.. లారీలు, బస్సుల్లో వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు.

ఇదీ చూడండి:

మహాత్మునికి, లాల్​ బహదూర్​ శాస్త్రికి సీఎం జగన్, చంద్రబాబు నివాళులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.