విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని ఒక కాలనీలో నివాసముంటున్న గర్భిణికి అర్ధరాత్రి నొప్పులు రావటంతో అంబులెన్స్‌కు కాల్ చేశారు. అది రావటానికి ఆలస్యమవ్వగా.. గర్భిణి బందులువు సింగ్ నగర్ ప్రధాన కూడలిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు ఓ ప్రవేట్ వాహనంలో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఇంతలో అంబులెన్స్ అక్కడకు చేరుకోవటంతో గర్భణిని జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులకు సమాచరం ఇవ్వగానే స్పందించడంపై స్ధానికులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి...