ఆంధ్ర-తెలంగాణ సరిహద్దైన కృష్ణా జిల్లా జొన్నలగడ్డ చెక్‌పోస్ట్ వద్ద వందలకొద్ది వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మధిరను రెడ్‌జోన్‌గా ప్రకటించింది. అధికారులు అక్కడ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. వాహనాల రాకపోకలను నిషేధించారు. అది తెలియక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సరైన సమాచారం లేక వచ్చామని.. వెళ్లడానికి అనుమతివ్వాలని పోలీసులను వేడుకున్నారు. వారు అనుమతించకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.
ఇదీ చదవండి: ASHOK BABU: '5' పీఆర్సీలు పెండింగ్‌లో పెడితే ఎలా..? సీఎం సార్