ETV Bharat / state

తెలంగాణ: నేటితో మూగబోనున్న మైకులు

తెలంగాణలో గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచారం చేయవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని నిబంధనలను ప్రకటించింది. జీహెచ్​ఎంసీ వెలుపలికి స్థానికేతర కార్యకర్తల తరలింపు, అభ్యర్థి వాహనం ఉపయోగం, వాడకం వంటి విషయాలను ప్రస్తావించింది.

last day of hyderbad election campain
నేటితో ముగబోనున్న మైకులు
author img

By

Published : Nov 29, 2020, 7:39 AM IST

Updated : Nov 29, 2020, 8:14 AM IST

నేటితో మూగబోనున్న మైకులు

తెలంగాణలో బల్దియా ప్రచారానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం 6 గంటల వరకు ప్రచార కార్యక్రమాలు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఎలాంటి ప్రచారానికి అనుమతి ఉండదని తేల్చి చెప్పింది. పోలింగ్ జరిగే 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసే సంప్రదాయాన్ని అందరూ పాటించాలని సూచించింది. వ్యక్తిగత, సభ, సమావేశాలు, ప్రసార మాధ్యమాలు.. ఇలా ఎటువంటి ప్రచారమైన ఆదివారం సాయంత్రం 6 తర్వాత చేసినట్లు రుజువైతే.. అభ్యర్థులకు రెండేళ్ల జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.

అభ్యర్థి ఒక వాహనానికి అనుమతి

ప్రచారం నిమిత్తం జీహెచ్​ఎంసీ వెలుపల నుంచి వచ్చిన స్థానికేతరులు, నాయకులు, కార్యకర్తలు వెళ్లిపోవాలని సూచించింది. ఇందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. పోలింగ్‌ రోజు ఓటింగ్‌ సరళి పరిశీలించేందుకు అభ్యర్థి ఒక వాహనానికి అనుమతి ఇచ్చింది. వారి ఎన్నికల ఏజెంట్‌ ఇందులో తిరగవచ్చని వివరించింది. పోటీలో ఉన్న అభ్యర్థి మినహా.. ఇతరులు వాహనం వాడటానికి వీలు లేదని వెల్లడించింది. ఇందుకు జీహెచ్​ఎంసీ డిప్యూటీ కమిషనర్లు అనుమతి ఇస్తారన్న ఎస్​ఈసీ.. వాహనం అద్దంపై ఆ పత్రాన్ని అంటించాలని స్పష్టం చేసింది.

పర్యవేక్షణ బృందాల‌కు 15 ఫిర్యాదులు

పోలింగ్‌ రోజున ఓటర్లను అభ్యర్థులు తమ వాహనాల్లో తరలించటం నేరమని పేర్కొంది. ఎన్నికల ప్రవర్తనా నియ‌మావ‌ళి ఉల్లంఘించిన 14 మందిపై కేసులు న‌మోదు చేసినట్లు ఎస్​ఈసీ ప్రకటించింది. ఎన్నిక‌ల పర్యవేక్షణ బృందాల‌కు 15 ఫిర్యాదులు అందాయన్న ఎస్​ఈసీ.. వివిధ పార్టీల‌కు చెందిన 7 వేల 814 ప్రచార తెర‌ల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తొలగించిందని చెప్పింది. ఇప్పటి వరకు మొత్తం కోటి 46 లక్షల రూపాయల నగదు, 13 లక్షల 66 వేల విలువైన మద్యం, గుట్కా పట్టుకోగా.. 68 మందిపై కేసులు నమోదు అయనట్లు తెలిపింది.

ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి

పోలింగ్ ఏజెంట్‌గా ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరు లేదా నివాసిని మాత్రమే నియమించుకోవాలనే నిబంధనను ఎస్​ఈసీ సవరించింది. అభ్యర్థి వార్డులో ఓటరుగా ఉన్న ఎవరినైనా నియమించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. బల్దియా ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి కోరారు. పోలింగ్ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ప్రతి ఒక్కరూ ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి: పార్థసారధి

Last Updated : Nov 29, 2020, 8:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.