బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని... బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్లమెంటులో బిల్లుపెట్టాలని కోరారు. విజయవాడలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. బీసీలంతా ఏకమై ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఈ పోలీసులు.. మనసున్న మహారాజులు!