కృష్ణాజిల్లా నాగాయలంక మండలం దిండి గ్రామంలో పిడుగుపాటుకు గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. తాడిచెట్టుపై పిడుగుపడి... ఆ మంటలు కిందే ఉన్న పశువుల పాక మీద పడ్డాయి. గమనించిన స్థానికులు మంటల్ని ఆర్పేశారు. ప్రస్తుతం వరి సాగుకు వ్యవసాయ పనులు మొదలవడంతో... పొలంలో ఎక్కడ పిడుగులు పడతాయోనని ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: మోకా భాస్కరరావు అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని