ETV Bharat / state

అద్భుత మేధస్సుతో అబ్బురపరుస్తున్న మూడేళ్ల 'జై' - three years boy jai gets registered in india book of records

మూడేళ్ల వయసులోనే అద్భుత మేధస్సుతో అబ్బురపరుస్తున్నాడు జై. 195 దేశాల జాతీయ జెండాలు, రసాయన శాస్త్రంలోని మూలకాలు, గ్రహాలను ఇట్టే గుర్తుపడుతూ... ఔరా అనిపిస్తున్నాడు. అతి స్వల్ప కాలంలోనే ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ , ఇంటర్నేషనల్ బుక్ అఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న చిచ్చర పిడుగుపై ప్రత్యేక కథనం.

three years boy jai
అద్భుత మేధస్సుతో అబ్బురపరుస్తున్న మూడేళ్ల 'జై'
author img

By

Published : Nov 14, 2020, 2:38 PM IST

అద్భుత మేధస్సుతో అబ్బురపరుస్తున్న మూడేళ్ల 'జై'

ఇక్కడ కనిపిస్తున్న ఈ బాల మేధావి పేరు జై. మూడేళ్ల వయసులోనే...195 దేశాల జాతీయ జెండాలను గుర్తించటంతో పాటు రసాయన శాస్త్రంలోని మూలకాలతోపాటు... గ్రహాలు, కారు లోగోలను ఇట్టే చెప్పేస్తాడు. ఆంగ్లంలో చిన్న పదాలు, హిందీ, తెలుగు అక్షరాలను అప్పజెప్పేస్తూ... అబ్బురపరుస్తున్నాడు.

కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన ప్రవీణ్ కుమార్ దంపతులు... వైద్యులుగా అమెరికాలోని సౌత్ కరోలైనాలో ఉంటున్నారు. వారి కుమారుడు జై. కరోనా మొదలవ్వక ముందు జనవరిలో జై తల్లిదండ్రులు ఘంటసాల తీసుకొచ్చి... బాలుణ్ని తాతయ్య , నాయనమ్మ దగ్గర వదిలి అమెరికాకు వెళ్ళారు. అప్పుడే చిన్నారి ప్రతిభను గుర్తించిన నానమ్మ... జై కు శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇంట్లో ఉన్న ప్రపంచ పటాన్ని చూపిస్తూ దేశాలను గుర్తు పట్టడం నేర్పించారు. వెంటనే ఆకళింపు చేసుకొని ఎలా అడిగినా టకటకా జవాబులు చెప్పేస్తూ ఉండటంతో.... అమెరికా నుంచి ప్రత్యేకంగా వివిధ దేశాల జెండా కార్డులు తెప్పించి వాటిని గుర్తు పట్టడం నేర్పారు.

జై ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి తెలియజేశారు. వారు నిర్వహించిన పరీక్షలో 112 దేశాల జాతీయజెండాలను తడుముకోకుండా చెప్పాడు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందాడు. అక్టోబరులో అమెరికా వెళ్ళిన జై... సౌత్ కరోలైనాలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు పెట్టిన పరీక్షలోనూ నెగ్గి సూపర్ టాలెంటెడ్ కిడ్‌గా అవార్డు సాధించాడు.

ఇదీ చదవండి:

రెండేళ్ల వయసులోనే అద్భుత ప్రతిభ... జ్ఞాపకశక్తితో ఔరా అనిపిస్తున్న బుడతడు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.