ఇనుప డిస్క్‌తో సుమారు 25 కిలోమీటర్లు..
కృష్ణాజిల్లా మొవ్వ కోర్టు వద్ద ఓ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆపకుండా వెళ్లిపోయిన కారుని కూచిపూడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూచిపూడి పోలీసులు స్థానికులు వెంబడించి పెనుమూడి టోల్ గేట్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. కారు నెంబరు AP07 DW 4567గా పోలీసులు గుర్తించారు. కారు ఒకవైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది., కారు టైరు కూడా పగిలిపోయింది. వాహనదారులు పగిలిన టైరుతో ఇనుప డిస్క్‌తో సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. కారులో నలుగురు వ్యక్తులు ఉండగా ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
బైకు ఢీకొన్న ఆర్టీసీ బస్సు
కృష్ణా జిల్లా మైలవరంలో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. ఎ.కొండూరు మండలం గొల్లమందల గ్రామానికి చెందిన మల్లేశ్వరరావు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మణుగూరు బస్సు ఢీకొట్టడంతో అతనికి కాలు విరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మల్లేశ్వరరావు తల్లిదండ్రులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. బాధితుడిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి. గుత్తి శివారులో జీపు బోల్తా.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు