కృష్ణా జిల్లాలోని మోపిదేవి, చల్లపల్లి, కోడూరు మండలాల్లో 3 రోజులు పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్లు తహసీల్దార్లు తెలిపారు. మోపిదేవి మండలంలో 6 ,7, 8 తేదీల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉందని.. మిగతా సమయాలలో సంపూర్ణ లాక్ డౌన్ పెడుతున్నామని మోపిదేవి తహసీల్దార్ కలిదిండి మస్తాన్ స్పష్టం చేశారు.
కోడూరు మండలంలో 8, 9, 10 తేదీల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు తహసీల్దార్ లతీఫ్ పాషా తెలిపారు. చల్లపల్లి మండలంలో 7, 8, 9 తేదీల్లో పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్లు తహసీల్దార్ కే.స్వర్ణమేరి ప్రకటించారు. ఈ మూడు రోజులు పాలు, మెడికల్, పెట్రోల్ బంక్, వైద్యశాలలు మినహా ఏ విధమైన వ్యాపార దుకాణాలు, వాణిజ్య సంస్థలు తెరిచి ఉంచకూడదని స్పష్టం చేశారు. ప్రజలు తమకు అవసరమైన కిరాణా సరుకులు, కూరగాయలు ఇతర వస్తువులన్నీ ముందుగానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి