ETV Bharat / state

కారు డోర్ లాక్.. ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి - car door lock children dead

కారు డోర్ లాక్.. ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి
three-children-dead-in
author img

By

Published : Aug 6, 2020, 6:26 PM IST

Updated : Aug 7, 2020, 1:59 PM IST

18:20 August 06

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో విషాదం జరిగింది. ఆడుకుంటూ కారులోకి వెళ్లి డోర్ లాక్ అయ్యి ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతిచెందారు.

కారు డోర్ లాక్.. ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి

సరదాగా ఆడుకుంటున్న ఆ చిన్నారులకు తాము ఎక్కబోతున్న కారే కబళిస్తుందని తెలియలేదు. రెండు వారాల కిందట స్వగ్రామం వెళ్లి వచ్చి కారు పార్కు చేసిన యజమాని కూడా అనుకుని ఉండడు.. తాను తెలియక చేసిన పొరపాటు ముగ్గురు చిన్నారుల్ని బలిగొంటుందని.. కానీ విధి లిఖితం.. మానవ తప్పిదం.. వెరసి అభం, శుభం తెలియని ముగ్గురు చిన్నారులు పసి ప్రాయంలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారు. కారులో చిక్కుకుపోయి, బయటకు రాలేక, ఊపిరి అందక నరకయాతన అనుభవించి ఆ పసిమొగ్గలు అనూహ్యంగా మృతి చెందడంతో కార్మికుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన చూసి పోలీసులు సైతం చలించిపోయారు.

ఏం జరిగింది? 

 అసోంకు చెందిన షాజహాన్‌ అలీ, అమీనా బేగం, పశ్చిమ బంగాకు చెందిన హసీమ్‌షేక్‌ కుటుంబాలు విడివిడిగా ఉపాధి నిమిత్తం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలోని మోహన్‌ స్పింటెక్స్‌ పరిశ్రమకు వచ్చారు. గత కొంత కాలం నుంచి అక్కడే పనిచేస్తూ సమీపంలోనే ఉన్న పరిశ్రమ వసతి సముదాయాల్లో నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్న సమయంలో వీరి ముగ్గురు పిల్లలైన సుహానా పర్వీన్‌(6), హప్సానా(6), రింపా యాస్మిన్‌(6)లు కలిసి వసతి సముదాయ ప్రాంగణంలో ఆడుకుంటున్నారు. సమీపంలో కారు ఉండడంతో దాని డోర్లు తెరిచేందుకు ప్రయత్నించగా, అవి తెరుచుకోవడంతో ముగ్గురు కలిసి లోపలకు ఎక్కారు. కాసేపటి తర్వాత బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా కారు డోర్లు ఆటో లాక్‌ అవ్వడంతో సాధ్యం కాలేదు. వీరు కారులో ఎక్కిన సంగతి ఎవరూ గమనించకపోవడం, డోర్లు తెరుచుకోకపోవడంతో ఊపిరి ఆడక కారులోనే ప్రాణాలోదిలేశారు. రింపా యాస్మిన్‌కు తండ్రి లేకపోవడం, తల్లి అమీనాబేగంకు తను ఒక్కటే సంతానం కావడం గమనార్హం.

ఎలా జరిగింది? 

మోహన్‌ స్పింటెక్స్‌లోనే స్టోర్‌ మేనేజర్‌గా పని చేస్తున్న కాశీ రమేష్‌.. రెండు వారాల కిందట తన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ప్రకాశరావుపాలెం వెళ్లి వచ్చి కారును వసతి సముదాయ ప్రాంగణంలో పార్క్‌ చేశారు. రిమోట్‌ సాయంతో డోర్‌ లాక్‌ చేసినట్లుగా ఆయన చెబుతున్నారు. కానీ కారు డోర్లు సరిగా పడలేదు. అప్పటి నుంచి ఆయనకు కారు తీసే అవసరం కూడా రాకపోవడంతో ఈ విషయాన్ని గమనించలేదు. పిల్లలు ఆడుకుంటూ కారు వద్దకు వెళ్లి డోర్లు పట్టుకుని లాగడం, అవి తెరుచుకోవడంతో ప్రమాదం సంభవించింది.

ఎప్పుడు జరిగింది?

 గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ముగ్గురు బాలికలు ఆడుకునేందుకు బయటకు వచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరూ గమనించలేదు. కారులో ఎక్కిన గంటలోపే వీరు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కారు లోపల ఉండే చిన్నపాటి అద్దం సాయంతో కారు ముందు అద్దాలు పగులగొట్టేందుకు చిన్నారులు ప్రయత్నించిన ఆనవాళ్లు కనిపించాయి. మృతుల శరీరంపై గాయాలు, కారు సీట్లపై రక్తపు మరకలు ఉండడం కొంత అనుమానం రేకెత్తించాయి. ఊపిరి ఆడక చనిపోయే క్రమంలో ఇలాంటివి చోటు చేసుకుంటాయని వీరవల్లి ఎస్సై చంటిబాబు పేర్కొన్నారు. మృతదేహాలను నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హనుమాన్‌ జంక్షన్‌ సీఐ డీవీ రమణ, ఎస్సై మదీనాబాషా దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండీ... 'సామూహిక కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వండి'

Last Updated : Aug 7, 2020, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.