అపరాధ రుసుంతో అక్రమ భవనాలు, లేఔట్ల క్రమబద్ధీకరణకు ఇకపై వీలు కల్పించబోమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. బిల్డింగ్ పీనలైజ్ స్కీం(బీపీఎస్) కొనసాగించే అవకాశం ఉండబోదని స్పష్టం చేశారు. విజయవాడలో స్థిరాస్తి వ్యాపారులతో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే శంకరావుతోపాటు స్థిరాస్తి వ్యాపార సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సుమారు 25 సమస్యలను మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారుల ముందు ఉంచారు. వాటన్నింటినీ కూలంకుషంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా మెరుగైన పద్ధతిలో పరిష్కారానికి ప్రయత్నిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అనుమతులు తీసుకునే నిర్మాణాలు చేపట్టాలని బొత్స సత్యనారాయణ సూచించారు. రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం అభివృద్ధి చెందేందుకు అవసరమైతే పొరుగు రాష్ట్రాల్లోని పరిస్థితులు అధ్యయనం చేసి ప్రస్తుత చట్టాలు, నిబంధనల్లో మార్పులకూ తాము చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం ఇసుక లభ్యత విషయంలో స్థిరాస్తి రంగం ఇబ్బంది ఎదుర్కొంటోన్న మాట వాస్తవమేనని అన్నారు. ప్రస్తుతం నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఇసుక కొరత ఎక్కువగా ఉంటోందన్నారు. కొత్త ఇసుక విధానం తీసుకొచ్చిన క్రమంలో ఇలాంటి బాలారిష్టాలు సహజమేనని, ఇవన్నీ కొద్దిరోజుల్లోనే పరిష్కారమవుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏప్రిల్ నాటికి అన్ని పట్టణాల్లో మాస్టర్ ప్లాన్‌లను తయారు చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. వీటి రూపకల్పనలో స్థిరాస్తి వ్యాపారులు వారి సలహాలు సూచనలు ఇవ్వాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు.
బీపీఎస్ను కొనసాగించే అవకాశం లేదు: మంత్రి బొత్స
బీపీఎస్ను కొనసాగించబోమని మంత్రి బొత్స వెల్లడించారు. ఇసుక కొరతతో స్థిరాస్తి రంగం ఇబ్బందులు ఎదుర్కోవటం వాస్తమేనని అన్నారు. త్వరలోనే ఈ సమస్య తొలిగిపోతుందని భరోసా ఇచ్చారు.
అపరాధ రుసుంతో అక్రమ భవనాలు, లేఔట్ల క్రమబద్ధీకరణకు ఇకపై వీలు కల్పించబోమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. బిల్డింగ్ పీనలైజ్ స్కీం(బీపీఎస్) కొనసాగించే అవకాశం ఉండబోదని స్పష్టం చేశారు. విజయవాడలో స్థిరాస్తి వ్యాపారులతో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే శంకరావుతోపాటు స్థిరాస్తి వ్యాపార సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సుమారు 25 సమస్యలను మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారుల ముందు ఉంచారు. వాటన్నింటినీ కూలంకుషంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా మెరుగైన పద్ధతిలో పరిష్కారానికి ప్రయత్నిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అనుమతులు తీసుకునే నిర్మాణాలు చేపట్టాలని బొత్స సత్యనారాయణ సూచించారు. రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం అభివృద్ధి చెందేందుకు అవసరమైతే పొరుగు రాష్ట్రాల్లోని పరిస్థితులు అధ్యయనం చేసి ప్రస్తుత చట్టాలు, నిబంధనల్లో మార్పులకూ తాము చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం ఇసుక లభ్యత విషయంలో స్థిరాస్తి రంగం ఇబ్బంది ఎదుర్కొంటోన్న మాట వాస్తవమేనని అన్నారు. ప్రస్తుతం నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఇసుక కొరత ఎక్కువగా ఉంటోందన్నారు. కొత్త ఇసుక విధానం తీసుకొచ్చిన క్రమంలో ఇలాంటి బాలారిష్టాలు సహజమేనని, ఇవన్నీ కొద్దిరోజుల్లోనే పరిష్కారమవుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏప్రిల్ నాటికి అన్ని పట్టణాల్లో మాస్టర్ ప్లాన్‌లను తయారు చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. వీటి రూపకల్పనలో స్థిరాస్తి వ్యాపారులు వారి సలహాలు సూచనలు ఇవ్వాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు.
శివ, పాడేరు
ఫైల్: విశాఖ జిల్లా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గంజాయి కలకలం సృష్టించింది పాడేరు నుంచి వైజాగ్ వెళ్లే ఆర్టీసీ బస్సులో బ్యాగుల్లో గంజి ఉందని డ్రైవర్ గుర్తించాడు వెంటనే ఇది ఎవరిది అని ప్రశ్నించగా ఎవరూ సమాధానం చెప్పలేదు దీనికి సంబంధించిన ఇటువంటి వ్యక్తులు జారుకున్నారు గంజాయి కలిగినటువంటి బ్యాగులను పాడేరు ఆర్టిసి బస్సు స్టేషన్ లో ఉంచారు ఎక్సైజ్ అధికారులకు గంజాయి దొరికిందని సమాచారం అందించారు నాలుగు బ్యాగుల్లో సుమారుగా 40 కేజీల గంజాయి ఉంటుందని అంచనా.
శివ, పాడేరు
Body:శివ
Conclusion:9493274036