మూలకణాల ద్వారా చేసే శస్త్ర చికిత్సపై ముంబైకి చెందిన న్యూరొజెన్ బ్రెయిన్ అండ్ స్పైన్ సంస్థ.. విజయవాడలో ఈ నెల 19న సదస్సు నిర్వహించనుంది. ఈ విషయంపై సంస్థ డిప్యూటి డైరెక్టర్ నందిని గోకుల్ చంద్రన్ మాట్లాడుతూ... మూలకణాల ద్వారా జన్యు సంబంధ, బుద్ధి మాంద్యానికి 90 శాతం మంచి ఫలితాలతో చికిత్స చేసే అవకాశం ఉందన్నారు. ఈ సదస్సులో జన్యు సంబంధ వ్యాధిగ్రస్థులు, బుద్ధి మాంద్యం కలిగిన వారు ఎవరైనా అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని వెల్లడించారు.
ఇదీ చదవండి: