కృష్ణాజిల్లా విజయవాడ మధురానగర్ బుడమేరు కట్టపై కొండచిలువ సంచారంతో స్థానికులు హడలిపోయారు. మధురానగర్ ఏలూరు కాల్వ బుడమేరు మద్యకట్ట రోడ్డులో వంతెనకు దగ్గరలో కొండచిలువను గుర్తించారు. వెంటనే కర్రలతో కొండచిలువను చంపే ప్రయత్నం చేసినా చనిపోకపోవడంతో ...ఇనుపరాడ్లతో కొండచిలువను చంపివేశారు. సుమారు పది అడుగుల ఉన్న కొండచిలువ కడుపునిండా ఆహారం తినడం వలన కదలలేని స్థితిలో ఉంది. అనంతరం కొందరు యువకులు ఆ కొండచిలువను భుజాలపై ఉంచుకొని తమ చరవాణిలో ఫోటోలు దిగారు. ఇటీవల వరదలతో కొండచిలువ వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
ఇదీచూడండి.అమరావతి కదిపితే ఊరుకోం : పవన్