కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి అనే విద్యార్థిని అమరావతి పరిరక్షణ జేఏసీకి ఎకరం భూమి విరాళంగా ఇచ్చింది. గతంలో రాజధాని నిర్మాణానికి తన పాకెట్ మనీ నుంచి వైష్ణవి లక్ష రూపాయల విరాళం అందించింది. రాజధానిపై తనకున్న ప్రేమను ప్రశంసిస్తూ అప్పట్లో ఆమెను అమరావతి అంబాసిడర్గా చంద్రబాబు ప్రకటించారు. విద్యార్ధిగా ఉంటూనే వైష్ణవి పాఠశాలల అభివృద్దికి రూ.4లక్షలు అందించింది.
ప్రస్తుతం రాజధాని అమరావతి తరలింపు... 3 రాజధానుల ప్రకటన ద్వారా ప్రజల్లో అయోమయం నెలకొన్న నేపథ్యంలో వైష్ణవి తన కుటుంబ సభ్యులతో ఎన్టీఆర్ భవన్కు వచ్చింది. అమరావతి పరిరక్షణకు ముదినేపల్లిలో ఈ నెల 12న దుర్గా మహా చండీయాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ కార్యక్రమానికి హాజరు కావాలని చంద్రబాబును కోరారు. ఇంటర్ చదువుతన్న వైష్ణవి... ఎకరం భూమిని అమరావతి పరిరక్షణ జేఏసీకి విరాళం ఇవ్వడం గొప్ప విషయమని చంద్రబాబు కొనియాడారు. 'సేవ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్'’ఉద్యమం రాష్ట్రమంతా అన్ని గ్రామాల్లో ఉద్ధృతంగా జరగాలని పిలుపునిచ్చారు. రాజధాని అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత 5కోట్ల ప్రజలపై ఉందన్నారు.
ఇదీ చూడండి: 'రాజధాని రైతులకు మద్దతుగా మహిళలు బంగారం విరాళం'