ETV Bharat / state

రెండో రోజు ఘనంగా ప్రారంభమైన పసుపు పండుగ

author img

By

Published : May 28, 2020, 11:13 AM IST

Updated : May 28, 2020, 12:28 PM IST

తెదేపా మహానాడు కార్యక్రమం రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. విజయవాడలోని ఎన్టీఆర్ భవన్​లో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

The second day was a gloriously mahanadu in NTR Bhavan in vijayawada
జ్యోతి ప్రజ్వలన చేస్తోన్న తెదేపా అధినేత చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పిస్తూ రెండో రోజు మహానాడు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ భవన్​కు చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబుకు.. కార్యకర్తలు భౌతిక దూరం పాటిస్తూ స్వాగతం పలికారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి అంతా పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడు రెండో రోజు వేడుకను లాంఛనంగా ప్రారంభించారు. తెదేపా సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చినరాజప్ప, బొండా ఉమామహేశ్వర రావు, వర్ల రామయ్య హాజరయ్యారు.

ఇదీ చదవండి:

అన్నమయ్య భవనంలో నేడు తితిదే మండలి సమావేశం

Last Updated : May 28, 2020, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.