ETV Bharat / state

మండలిపై ఏకీకృత విధానం ఉండాలి: పార్లమెంటరీ స్థాయి సంఘం - పార్లమెంటరీ స్థాయీ సంఘం వార్తలు

రాష్ట్రాల శాసన మండలి రద్దు, ఏర్పాటు అంశాలపై ఒక జాతీయ స్థాయి విధానాన్ని రూపొందించాలని 2013లో పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఇందులో కొత్త ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ పరిస్థితి స్థానిక సంస్థల ప్రాతినిధ్యం వంటి అంశాలను పొందుపరిచింది.

legislative council
శాసన మండలి
author img

By

Published : Jan 28, 2020, 7:49 AM IST

రాష్ట్రాల శాసన మండలి రద్దు, ఏర్పాటు అంశాలు అక్కడున్న ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా ఉండాలంటే ఒక జాతీయ స్థాయి విధానాన్ని రూపొందించాలని 2013లో పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ‘మండలి ఏర్పాటుకు రూ.100 కోట్లు ఖర్చవుతుంది.. ఆ ఖర్చును భరించే శక్తి రాష్ట్రానికి ఉంది. అందువల్ల మండలిని పునరుద్ధరించాలి’ అంటూ 2013లో రాజస్థాన్‌ ప్రభుత్వం శాసనసభలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. దీనిపై అధ్యయనం చేసిన శాంతారాం నాయక్‌ నేతృత్వంలోని సిబ్బంది వ్యవహారాలు, ప్రజాఫిర్యాదులు, న్యాయశాఖలకు చెందిన పార్లమెంటరీ స్థాయీసంఘం 2013 డిసెంబర్‌ 9న నివేదిక సమర్పించింది. రాజస్థాన్‌లో మండలి పునరుద్ధరణకు ఏకగ్రీవ సిఫార్సు చేస్తూ.. నివేదికలో ప్రధానంగా 3 అంశాలను సూచించింది.

  • శాసనమండలి రద్దు, ఏర్పాటుపై జాతీయ స్థాయిలో ఏకీకృత విధానం ఉండాలి. మండలి కాలపరిమితి ఆ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వ పరిస్థితిపై ఆధారపడకూడదు. ఒకసారి ఏర్పడిన మండలిని రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ ఇష్టానుసారంగా రద్దు చేయకూడదు.
  • ​​​శాసన మండళ్ల కూర్పుపై పూర్తి స్థాయి సమీక్ష జరగాలి. ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రాతినిధ్యం.. కేవలం పట్టణ స్థానిక సంస్థలకే పరిమితం కాకూడదు. పంచాయతీరాజ్‌, వార్డు కమిటీలకూ తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.
  • మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం అమల్లో ఉన్న ఎమ్మెల్యే కోటా, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయ నియోజకవర్గాల గురించి సమీక్షించాలి.

ఇదీ చూడండి:

మండలిపై రూపాయి ఖర్చైనా దండగే: సీఎం జగన్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.