విజయవాడలో కోస్టల్ బ్యాంకు ఏర్పాటు చేసిన కార్పొరేట్ కార్యాలయాన్ని... ఆర్‌బీఐ ప్రాంతీయ సంచాలకులు సుబ్రతదాస్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో బ్యాంకులు లేని ప్రాంతాల్లో... కోస్టల్ బ్యాంకు సేవలందిస్తోందని వివరించారు. 1999 నుంచి 2019 వరకు కోస్టల్ బ్యాంకు రుణ గ్రహీతలకు లాభాలు చేకుర్చేలా అన్నిరకాల రుణాలపై వడ్డీలు తగ్గిస్తుందని కోస్టల్ బ్యాంకు ఛైర్మన్ కె.వెంకట్రామన్, సీఈవో బి.వేణుగోపాలరెడ్డి తెలిపారు. నెలవారీ వడ్డీ ఆదాయాన్ని కోరుకునే ఖాతాదారులకు లాభం చేకూర్చేలా దీర్ఘకాల డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు అందిస్తున్నామన్నారు.
ఇదీ చూడండీ: