కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ సర్వసభ్య సమావేశంలో సంఘం నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలో నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు కొండపర్తి లీలాజయకృష్ణ, రామడు వాసులు కమిటి సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.
భవిష్యత్ కార్యచరణపై చర్చ..
గ్రామాల నుంచి వచ్చిన విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ సభ్యులు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సింహాద్రి కనకాచారి, గోసంరక్షణ సమితి రాష్ట్ర నాయకులు సిరిపల్లి సిద్దార్ధ, సంఘం గౌరవాధ్యక్షులు గోవర్ధన శాస్త్రి పాల్గొన్నారు.