ETV Bharat / state

జగన్​ను కుటుంబ సభ్యులే నమ్మరు.. ఇక జనం ఎలా నమ్మాలి.. : నారా లోకేశ్

Yuvagalam Padayatra : నువ్వే మా నమ్మకం పేరుతో జగన్ మోహన్ రెడ్డి మరోసారి మోసగించటానికి వస్తున్నారని.. ప్రజలంతా బుద్ధి చెప్పి పంపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గంజాయితో యువత భవిష్యత్ ను నాశనం చేసిన జగన్... భవిష్యత్ నువ్వే పేరుతో వస్తున్నాడని మండిపడ్డారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నెలో యువగళం పాదయాత్ర ఘన స్వాగతం లభించింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పాదయాత్రలో పాల్గొని అభిమానులు, పార్టీ కార్యకర్తలకు సెల్ఫీలు ఇచ్చారు.

యువగళం పాదయాత్ర
యువగళం పాదయాత్ర
author img

By

Published : Apr 7, 2023, 10:20 PM IST

Updated : Apr 8, 2023, 6:20 AM IST

Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నెలో ఘన స్వాగతం లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చారు. తనని కలవడానికి వచ్చిన యువత, మహిళలు, వృద్ధులను కలుస్తూ లోకేశ్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని.., బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో బీసీలకు తెలుగుదేశం ఏం చేసిందనేది చర్చకు తాను సిద్ధమని.., వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమా అని లోకేశ్ సవాల్‌ విసిరారు.

యువగళం పాదయాత్ర

జగన్ ఎస్ఎస్​సీ ఫెయిల్... నువ్వే నా నమ్మకం, నువ్వే నా భవిష్యత్తు, జగన్ కి చెబుదాం.. అంటూ కొత్త కొత్త పేర్లతో జగన్‌ ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పేరు దొంగ మోహన్ అని.. ఆయన పదవ తరగతి ఫెయిల్ అని విమర్శించారు. అందుకే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో దొంగ మోహన్ ఓటు వేయలేక పోయాడని దుయ్యబట్టారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని, ఐదు రోజులు బెంగళూరులో, రెండు రోజులు అనంతపురంలో ఉంటారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి 500 ఎకరాల స్థలాన్ని కాజేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే, ఆమె భర్త ఇసుక, మట్టిని దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంజాయి వద్దు బ్రో... యువగళం పాదయాత్రకు శింగనమల నియోజకవర్గంలో భారీ స్పందన వస్తోంది. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కావటంతో.. యువత ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ పాదయాత్ర నిర్వహించారు. గంజాయి వద్దు బ్రో అంటూ ముద్రించిన టీషర్టులు, టోపీలు పెట్టుకొని యువత పెద్దఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రం గంజాయి అంధ్రప్రదేశ్ గా మారిపోయిందని, యువత ప్రజలు అప్రమత్తగా ఉండాలని మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని లోకేశ్ కోరారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాదయాత్రకు సంఘీభావం తెలిపి లోకేశ్​తో కలిసి నడవటం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

బాలకృష్ణతో కలిసి సెల్ఫీలు.. తన మామ నందమూరి బాలకృష్ణతో కలిసి మర్తాడు నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్.. మార్గమధ్యంలో మహిళలు, యువతకు సెల్ఫీలు ఇస్తూ అడుగులు వేశారు. బాలకృష్ణ దాదాపు రెండు కిలోమీటర్లు పైగా పాదయాత్రలో పాల్గొని యువత, మహిళలను పలకరిస్తూ, వారికి సెల్ఫీలు ఇస్తూ ముందుకు సాగారు. యువగళం దెబ్బకు జగన్ కు భయం పుట్టుకుందని నారా లోకేశ్ విమర్శించారు.

జగన్​కు బుద్ధి చెప్పాలి... ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఓటు ఆయుధమని.. కులమనే రొచ్చులో పడి మరోసారి పొరపాటు చేయవద్దని ప్రజలను కోరారు. విద్య, వైద్యం, బడి, గుడి అన్ని వ్యవస్థలను జగన్ మోహన్ రెడ్డి నాశనం చేశారని, తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. యువత ఉపాధికి ఒక్క పరిశ్రమ తీసుకరాలేకపోయారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలు, రాష్ట్రంలో పాలన మార్పు కోరుకుంటున్నారని బాలయ్య తెలిపారు.

శిలాఫలకం ఆవిష్కరణ.. శింగనమల నియోజకవర్గంలో 63వ రోజు పాదయాత్రతో 11 కిలోమీటర్ల మేర నడిచిన లోకేష్ 805 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. గార్లదిన్నె మండలం మర్తాడులో 800 కిలోమీటర్ల పాదయాత్రకు గుర్తుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నువ్వే మా నమ్మకం పేరుతో జగన్ మోహన్ రెడ్డి మరోసారి మోసగించటానికి వస్తున్నారని.. ప్రజలంతా బుద్ధి చెప్పి పంపాలని చెప్పారు. గంజాయితో యువత భవిష్యత్ ను నాశనం చేసిన జగన్... భవిష్యత్ నువ్వే పేరుతో వస్తున్నాడని మండిపడ్డారు. జగన్​ను సొంత కుటుంబ సభ్యులే నమ్మటంలేదని, తోబుట్టువులనే ఆయన దూరం చేసుకున్నారని, ప్రజలు ఎలా నమ్ముతారని లోకేశ్ అన్నారు. రైతులను ఆదుకోకపోగా, నకిలీ విత్తనాలు, మోటర్లకు మీటర్లతో అన్నదాతలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాడని విమర్శించారు.

నేడు విరామం.. శింగనమల మండలం జంబులదిన్నె విడిది కేంద్రంలో రాత్రి బస చేసిన నారా లోకేశ్.. నేడు యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించారు. విడిది కేంద్రం వద్ద బహిరంగ సభకు భారీగా తరలివస్తున్న రైతులను ఆయన కలవనున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 8, 2023, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.