ఉమ్మడి హైకోర్టు విడిపోయి నవ్యాంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఏర్పడి ఈ రోజుతో ఏడాది పూర్తవుతుంది. 13 మంది జడ్జిలతో 2018 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ భూభాగంలో హైకోర్టు సేవలు అందించడం ప్రారంభించింది . ప్రస్తుతానికి హైకోర్టులో 15 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన హైకోర్టును కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదన తెరపైకి రావడంతో న్యాయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది . హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ 2018 డిసెంబర్ 26న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వుల జారీచేశారు.
2019 జనవరి 1న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ హైకోర్టుకు కేటాయించిన 13 మంది న్యాయమూర్తులతో అప్పటి గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పట్లో ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. విజయవాడలో ప్రస్తుతం గవర్నర్ నివసిస్తున్న రాజ్ భవన్ అంతకు ముందు సీఎం క్యాంప్ కార్యాలయంగా సేవలు అందించిన భవనంలో 2019 జనవరి 2న హైకోర్టు మొదటి రోజు విధులు ప్రారంభమయ్యాయి.
అమరావతిలోని నేలపాడు గ్రామ పరిధిలో హైకోర్టు శాశ్వత భవనం శంకుస్థాపన, సమీపంలో నిర్మించిన జ్యుడీషియల్ కాంప్లెక్స్ భవనంలో హైకోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం 2010 ఫిబ్రవరి 3న జరిగింది . అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుండి హైకోర్టును తరలించి 2018 మార్చి 18 నుండి నేలపాడు గ్రామం వద్ద నిర్మించిన జ్యుడీషియల్ కాంప్లెక్స్లో హైకోర్టు తొలిరోజు విధులు ప్రారంభమయ్యాయి . మధ్యప్రదేశ్కు చెందిన జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఏపీ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి గా 2019 అక్టోబర్ 7న ప్రమాణస్వీకారం చేశారు . గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు . 2019 డిసెంబర్ 1న జరిగిన రాష్ట్ర స్థాయి న్యాయాధికారుల సదస్సులో జస్టిస్ జీకే మహేశ్వరి మాట్లాడుతూ.. హైకోర్టులో 1,90,431 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు . 15 మంది జడ్జిలు ఉండగా ఒక్కో జడ్జిపై 12,695 కేసుల భారం ఉందన్నారు .
ఇదీచూడండి.జీఎన్ రావు నివేదిక అమలుపై.. హైకోర్టులో అనుబంధ పిటిషన్