ETV Bharat / state

అమ్మఒడికి ఎసరు..! బడి ఫీజు బాధ్యత తల్లిదండ్రులదే.. - School Fees

Amma vodi : విద్యాహక్కు చట్టానికి జగన్ సర్కారు కొత్త భాష్యం చెప్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత అడ్మిషన్లు కల్పించాల్సి ఉండగా.. ఆ బాధ్యతను విస్మరిస్తోంది. ఫీజులు నిర్ణయించి.. ప్రవేశాల్లో రిజర్వేషన్లు ప్రకటించింది. 'అమ్మఒడి' కింద అందే సాయం నుంచే ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్తైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ
ప్తైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ
author img

By

Published : Feb 27, 2023, 9:42 AM IST

ప్తైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ

Amma vodi : విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలకు అమ్మఒడి పథకం కింద అందే సాయం నుంచే ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం తల్లిదండ్రులకు స్పష్టం చేసింది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు చెందిన పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటాను ఉచితంగా కేటాయించాల్సిన ప్రభుత్వం... ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది. ఫలితంగా తల్లిదండ్రులపైనే ఆ ఫీజుల భారం పడనుంది.

ఉత్తర్వులు జారీ.. ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటాలో సీట్లు పొందే విద్యార్థుల తల్లిదండ్రులు.. అమ్మఒడి పథకం సాయం నుంచే ఫీజులు చెల్లించుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విద్యాహక్కు చట్టం కింద రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం ప్రవేశాలకు నోటిఫికేషన్‌ ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌.. ఆదివారం విడుదల చేశారు. విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి, దివ్యాంగులకు రిజర్వేషన్లవారీగా ఉచితంగా కేటాయించాలి. విద్యాసంస్థల ఫీజులను ప్రభుత్వం చెల్లించాలి.

సాయం నుంచే ఫీజులు... కానీ రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన, బలహీనవర్గాలకు వంద శాతం అమ్మఒడి పథకం కింద సాయం అందిస్తున్నందున... ఇందులోంచే ఫీజులు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అమ్మఒడి కింద... 15 వేల రూపాయల్లో పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణకు రూ.2 వేలు మినహాయించి... రూ.13 వేలు ఇస్తోంది. ఈ సాయం అందిన 60 రోజుల్లోపు తల్లిదండ్రులు ఫీజు చెల్లించకపోతే తదుపరి సంవత్సరం ఆ మొత్తాన్ని మినహాయించి పాఠశాలలకు చెల్లిస్తారు. ప్రస్తుతం 75 శాతం హాజరు నిబంధన కోసం ఏడాది పూర్తయిన తర్వాత అమ్మఒడి సాయం అందిస్తున్నారు. గత ఏడాది ప్రవేశాలు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు... ఈ ఏడాది ఇచ్చే అమ్మఒడి నుంచే ఫీజులు చెల్లించాలి. ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో.. అమ్మఒడితో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని భావించిన వారిపై భారం పడనుంది..

మార్గదర్శకాలు జారీ.. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటా ప్రవేశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లోని పోర్టల్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలోని ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత 3 కిలోమీటర్ల దూరంలోని వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అనాథలు, హెచ్ఐవీ బాధితులు, దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, గ్రామాల్లో లక్షా 20 వేలు, పట్టణాల్లో లక్షా 44 వేల లోపు ఆదాయం ఉన్న బలహీనవర్గాలకు 6 శాతం సీట్లను కేటాయిస్తారు. ఆయా రిజర్వేషన్లలో విద్యార్థులు లేకపోతే.. వాటిని ఇతరులకు కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో మొదట ఎస్టీ పిల్లలకు ప్రాధాన్యం ఇస్తారు. సీట్లు కేటాయించిన వారం రోజుల్లో పిల్లలు పాఠశాలల్లో చేరిందీ లేనిదీ యాజమాన్యం నిర్ధారించకపోతే... దాన్ని వివాదాస్పద సీటుగా పరిగణిస్తారు. దీన్ని జిల్లా ప్రవేశాల పర్యవేక్షణ కమిటీకి సిఫార్సు చేస్తారు. కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే కలెక్టర్‌ను సంప్రదించొచ్చు.

మార్చి 18 నుంచి అడ్మిషన్లు.. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ప్రైవేట్ స్కూళ్లల్లో పేదల అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ ఏడో తేదీ వరకు అడ్మిషన్ల స్వీకరణ. ప్రైవేట్ స్కూళ్లల్లో పేదల అడ్మిషన్ల కోసం 25 శాతం సీట్లు రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 6 శాతం, అనాథలు, వికలాంగులు, హెచ్ఐవీ బాధితులకు 5 శాతం మేర ప్రైవేట్ స్కూళ్లల్లో కోటా కేటాయించింది.

ఫీజుల నిర్ధారణ.. ప్రైవేట్ స్కూళ్లల్లో అడ్మిషన్లు తీసుకున్న పేదలకు అమ్మఒడి వర్తించనుంది. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులను అమ్మఒడి నుంచి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏ తరగతికైనా ఒకే విధమైన ఫీజు ప్రభుత్వం నిర్ధారించింది. అర్బన్ ప్రాంతంలో రూ.8 వేలు, రూరల్ ప్రాంతంలో రూ.6500, గిరిజన ప్రాంతంలో 5100 రూపాయలుగా ఫీజు ఖరారు చేసింది. అమ్మఒడి ద్వారా వచ్చిన మొత్తంలో ప్రభుత్వం నిర్ధారించిన విధంగా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు చెల్లించాలని లబ్ధిదారులకు ప్రభుత్వం సూచించింది. లబ్ధిదారులు ఫీజులు చెల్లించకుంటే అరవై రోజుల్లో ప్రభుత్వమే స్కూళ్ల యాజమాన్యాలకు చెల్లిస్తుందని జీవోలో స్పష్టం చేసింది. ఫీజులు చెల్లించని లబ్ధిదారులకు ఆ తర్వాత ఏడాది జరిపే అమ్మఒడి చెల్లింపులో కోత విధిస్తామని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.