ETV Bharat / state

చేనేత వస్త్రాలపై పండగ రాయితీ నిలిపివేసిన ప్రభుత్వం - handloom textiles problems in krishna

కొవిడ్‌ కారణంగా సంక్షోభంలోకి వెళ్లిన చేనేత పరిశ్రమ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తులు కొనుగోళ్లు చేసేవారు లేక, మళ్లీ వస్త్ర ఉత్పత్తులు చేయలేక చేనేత సహకార సంఘాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పలుమార్లు అటు పాలకులకు, ఇటు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో కనీసం పండగల రాయితీ ఇస్తారు కదా కొంత వరకైనా విక్రయించుకోవచ్చనే ఆశతో ఎదురు చూశారు. దసరా పండగకు రాయితీ ఇవ్వక పోవడంతో నిరాశ చెందిన నేతన్నలు దీపావళి, సంక్రాంతికైనా రాయితీ ఇవ్వాలని కోరుతున్నారు.

చేనేత వస్త్రాలపై పండగ రాయితీ నిలిపివేసిన ప్రభుత్వం

author img

By

Published : Nov 2, 2020, 10:11 AM IST

సంఘాల్లో పేరుకుపోయిన వస్త్ర నిల్వలు

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతోపాటు గూడూరు, పెడన, ఘంటసాల, ముదినేపల్లి, చల్లపల్లి, మొవ్వ మండలాల్లో 34 చేనేత సంఘాల పరిధిలో వేలాదిమంది కార్మికులు నేత పనిపై ఆధారపడి జీవిస్తారు. ప్రస్తుతం ఆయా సంఘాల్లో రూ. కోట్ల విలువైన వస్త్ర ఉత్పత్తులు మూలుగుతున్నాయి. ఉత్పత్తులు కొనేవారి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న తరుణంలో అందరూ దసరా, దీపావళి, సంక్రాంతి పండగలపై ఆశపెట్టుకున్నారు. ఏటా ఒక్కో పండగకు పదిరోజులు చొప్పున వస్త్రాల కొనుగోలుపై ప్రభుత్వం 30శాతం రాయితీ ఇస్తుంటుంది. తక్కువ ధరకు వస్త్రాలు రావడంతో ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఒక్కో పండగకు రూ.2కోట్ల వరకు వస్త్రాలు అమ్ముడు పోతుంటాయి. దసరాకు ఆ రాయితీకూడా ప్రకటించక పోవడంతో ఆ ఆశకూడా పోయిందని ఆయా సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. మిగిలిన పండగలకైనా ఇస్తారో లేదోనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బకాయిల విడుదల ఎప్పటికో..?

ఇటు రాయితీ ప్రకటించకపోగా ఆయా సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కూడా విడుదల చేయడం లేదు. జిల్లావ్యాప్తంగా ఉన్న సంఘాలకు వివిధ పథకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తుంటాయి. కొన్నేళ్లుగా ఆ బకాయిలు కూడా విడుదల కావడం లేదు. కేవలం మార్కెట్‌ ఇన్సెంటివ్‌ కింద రావాల్సిన బకాయిలే రూ.5కోట్లకుపైగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీంతోపాటు పెట్టుబడిపై వడ్డీ రాయితీ కింద రూ.1.23కోట్లు, నూలు రాయితీ కింద రూ.కోటి వరకు విడుదల కావాల్సి ఉంది ఇలా జిల్లా వ్యాప్తంగా ఆయా సంఘాలకు కలిపి మొత్తం రూ.7.52కోట్ల వరకు బకాయిలు రావాలి. ప్రభుత్వం చొరవ చూపి బకాయిలను వెంటనే విడుదల చేయాలని సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించకుండా ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఉపయోగం ఉండదంటున్నారు.

  • పండగకు రూ.25 లక్షలు
    జాగాబత్తుల కోటేశ్వరరావు, శ్యామ్‌ప్రసాద్‌ చేనేత సహకారసంఘ మాజీ అధ్యక్షుడు

ఏటా మూడు పండగలకు ప్రభుత్వం రాయితీ ప్రకటించేది. ఒక్కో దానికి మాసంఘం నుంచి రూ.20 లక్షల నుంచి రూ.25లక్షల వస్త్రాలు విక్రయించే వాళ్లం. ప్రస్తుతం సంఘాలన్నీ పండగల మీద ఆశపెట్టుకుంటే ప్రభుత్వం నిరుత్సాహ పరిచింది. దీపావళి, సంక్రాంతికైనా రాయితీ ఇస్తే సంఘాల్లో ఉన్న వస్త్ర నిల్వల్లో కొంత వరకైనా అమ్ముడవుతాయి. సంఘాలకు రావాల్సిన బకాయిలు కూడా త్వరితగతిన విడుదల చేయాలని కోరుతున్నాం.

  • ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి

రఘునందన్‌, ఏడీ, చేనేత జౌళిశాఖ

చేనేతసంఘాలకు వివిధ పథకాలకు సంబంధించి బకాయిలు విడుదలకావాల్సి ఉంది. వాటిపై నివేదికను ప్రభుత్వానికి అందజేశాం. బడ్జెట్‌ విడుదల కాగానే సంఘాలకు జమ అవుతాయి. పండగలకు ఇచ్చే రాయితీ ఇంకా ప్రకటించలేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇవీ చదవండి

గంజాయి మత్తు...యువత చిత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.