ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూసేకరణ పలు కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తోంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో మూడు తరాలనుంచి కరిసె జ్ఞానానందం అనే రైతు భూమిని సాగు చేసుకుంటున్నాడు. కొన్నేళ్లనుంచి ఆ భూమి పట్టాదారు పాసుపుస్తకం కోసం అధికారుల చుట్టూ తిరిగిన వారు పట్టించుకోలేదు. అడంగల్‌లో మూడుతరాల సమాచారం ఉన్నా.. పట్టాదారు పుస్తకం ఇవ్వలేదు. ఇప్పుడేమో... పాసుపుస్తకం లేదని, అది ప్రభుత్వ భూమి అని అధికారులు బలవంతంగా లాక్కుంటున్నారని జ్ఞానానందం ఆవేదన వ్యక్తం చేశాడు. తమ జీవనాధారమైన భూమిపోతే ఎలా బతకాలని... ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు.
మా భూములు లాక్కుని పట్టాలిస్తారా..? - తిరుమలగిరిలో భూసేకరణ వార్తలు
ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ కోసం చేపట్టిన భూసేకరణ దళిత కుటుంబాల్లో ఆందోళన రేపుతోంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో మూడు తరాలుగా దళితులు సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు బలవంతంగా సేకరిస్తున్నారు.
ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూసేకరణ పలు కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తోంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో మూడు తరాలనుంచి కరిసె జ్ఞానానందం అనే రైతు భూమిని సాగు చేసుకుంటున్నాడు. కొన్నేళ్లనుంచి ఆ భూమి పట్టాదారు పాసుపుస్తకం కోసం అధికారుల చుట్టూ తిరిగిన వారు పట్టించుకోలేదు. అడంగల్‌లో మూడుతరాల సమాచారం ఉన్నా.. పట్టాదారు పుస్తకం ఇవ్వలేదు. ఇప్పుడేమో... పాసుపుస్తకం లేదని, అది ప్రభుత్వ భూమి అని అధికారులు బలవంతంగా లాక్కుంటున్నారని జ్ఞానానందం ఆవేదన వ్యక్తం చేశాడు. తమ జీవనాధారమైన భూమిపోతే ఎలా బతకాలని... ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు.
ఇదీచూడండి.విజయవాడలో వీణాధారిణికి నాదహారతి