పదో తరగతి మార్కుల జాబితాలో(మెమో) ఇకనుంచి పేపర్ల వారీగానూ, సబ్జెక్టుల వారీగానూ గ్రేడ్లు ఇస్తారు. పదో తరగతిలో హిందీ మినహా మిగతా అన్ని సబ్జెక్టులకూ రెండేసి పేపర్లుంటాయి. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతిలో తెచ్చే సంస్కరణలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం ఏదైనా ఒక పేపరులో ఉత్తీర్ణత సాధించలేనప్పుడు పేపర్ల వారీగా ఇచ్చే గ్రేడ్ల అనుత్తీర్ణత గ్రేడ్లు వచ్చినా.. సబ్జెక్టుతో కలిపినపుడు ఉత్తీర్ణత గ్రేడు ఇస్తారు. జాతీయ పాఠ్యాంశాల ప్రణాళిక-2019. ,సిఫార్సులు, నూతన విద్యా విధానం -2019, పరీక్షల్లో సంస్కరణలకు పాఠాశాల విద్యాశాఖ కమిషనర్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులు. పదోతరగతి పరీక్షల్లో మార్పులు తేవాలన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ సంస్కరణలు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
- ప్రశ్నాపత్రం 4 సెకన్లుగా ఉంటుంది.
- అబ్జెక్టివ్ విధానం- ఒక్క పదంలో సమాధానం రాయాలి. ఐచ్ఛికాలుండవు.
- సూక్ష్మ లఘుప్రశ్నలు- ఒకటి లేదా రెండు వాక్యాల్లో అన్నింటికి సమాధానాలు రాయాలి.. లఘుప్రశ్నలు- రెండు, నాలుగు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. ఐచ్ఛికాలుండవు.
- వ్యాసరూప ప్రశ్రలు- ఛాయిస్ ఉంటుంది. అయితే, తెలుగు పేపరు-2 లో రెండో ప్రశ్న, ఆంగ్లం పేపరు-1లో 35వ, పేపరు-2లో 28వ ప్రశ్రలకు ఛాయిస్ ఇవ్వలేదు.
- సమాధాన పత్రం 24 పేజీలు ఉంటుంది. అదనపు పత్రాలు ఇవ్వరు.
- ప్రశ్నాపత్రం చదువుకోవడానికి 15 నిముషాలు అదనంగా సమయం ఉంటుంది.
మార్కుల విధానం..
సెక్షన్ | ప్రశ్న విధానం | ప్రశ్నల సంఖ్య | ఒక్కో ప్రశ్నకు మార్కులు | మొత్తం మార్కలు | శాతం | ప్రశ్నకు సరాసరి నిమిషాలు | సెక్షన్‌కు నిమిషాలు |
1 | అబ్జెక్టివ్ | 12 | 1/2 | 6 | 12 | 1.5 | 18 |
2 | సూక్ష్మ లఘు | 8 | 1 | 8 | 16 | 3 | 24 |
3 | లఘు సమాధానాలు | 8 | 2 | 16 | 32 | 6 | 48 |
4 | వ్యాసరూప సమాధానాలు | 5 | 4 | 20 | 40 | 12 | 60 |
మొత్తం | 33 | 50 | 100 | 150(2.30 గం.లు) |
ఇదీచూడండి.'అపరిష్కృత గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయండి'